Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో హౌస్ లో నుండి బయటికి వెళ్లేందుకు నామినేషన్స్ లో ఉన్న గీతూ ఎట్టకేలకు ఈ వారం కూడా సేఫ్ గా బయటపడింది. గీతూ టాప్ 5 లో ఉండే అవకాశం ఉందని ఇప్పటికే పలువురు అంచానా వేస్తున్నారు. తనదైన చిత్తూరు యాసలో ఎంతో తెలివిగా గేమ్ ఆడుతూ కామెడీ చేస్తూ హౌస్ సభ్యులను ఓ ఆట ఆడుకుంటోంది. ఎక్కడా తగ్గకుండా తన ప్రదర్శనను బయటపెట్టి వినోదాన్ని అందిస్తోంది.
బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొదటి రెండు వారాల్లో గీతూ ప్రదర్శనను అందరూ తప్పు బట్టారు. తర్వాత వామ్మో గీతూ లేకుండా హౌస్ ఎంత బోరింగ్ గా ఉండేదో అని అభిప్రాయపడ్డారు. ఇప్పటికి అనేక సార్లు నామినేషన్స్ లో ఉన్నప్పటికీ ఆడియన్స్ సపోర్ట్ తో ప్రతి వారం సేవ్ అవుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ఎపిసోడ్ లో కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి.

కెప్టెన్ రేవంత్ ని స్టోర్ రూంలో ఉన్న వాటిని తీసుకురమ్మని నాగార్జున చెప్తాడు. దీంతో గమ్మున ఉండకుండా గీతూ ఎంటర్ అవుతుంది. సార్.. రేవంత్ కి కాలు నొప్పిగా ఉంది ఎవరైనా వేరే వాళ్లని పంపమని చెబుతుంది. ఇంకేముందు నాగార్జున వెంటనే ఎవరో ఎందుకు నీవే వెళ్లు అంటాడు. ఇక ఆదివారం ఎపిసోడ అయ్యేంత వరకు స్టోర్ రూంలో ఏం తీసుకురావాలన్న గీతూని పంపిస్తాడు నాగ్. దీంతో అనవసరంగా సలహా ఇచ్చాను కదరా బాబు అని గీతూ అనుకుంటుంది.
ఇక ఇదే ఎపిసోడ్ లో నామినేషన్స్ నుండి గీతూ సేవ్ అవుతుంది. దీంతో నాకు సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అని గీతూ చెప్తుంది. అంతటితో గమ్మున ఉండకుండా.. ప్రతి ఒక్కరి ఇంట్లో గీతూ లాంటి అమ్మాయి ఉంటే బావుంటుందని అనుకునేలా చేస్తా అంటుంది గీతూ. ఇంకేముంది అక్కడ స్టేజ్ పైన నాగార్జున ముందు ఉన్న ఆడియన్స్ వద్దు బాబోయ్ అంటూ సరదాగా చేతులు ఊపుతారు.