Rana: విక్టరీ వెంకటేశ్ హీరోగా, ఆయన సోదరుడు దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాతగా తెలుగు చిత్ర సీమలో సుపరిచితులు. అయితే, సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి రానా పాన్ ఇండియా లెవల్ హీరోగా సక్సెస్ అయ్యాడు. సురేష్ బాబు కొడుకు కాబట్టి రానా కూడా నిర్మాతగా అవతరిస్తాడని చాలా మంది భావించారు. అయితే, కథానాకుడిగా తిరుగలేని క్రేజ్ సంపాదించుకున్నాడు రానా. ఇక మిగిలింది ఈ ఫ్యామిలీలో మల్టీ స్టారర్ మూవీనే. అయితే, దీనికి శుభం కార్డు పడిందని చెప్పవచ్చు.
వెంకటేశ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో రానా నాయుడు అనే వెబ్ సిరీస్ త్వరలో వస్తోంది. ఇందులో వెంకటేశ్, రానా కలిసి నటిస్తున్నారు. ఇటీవలే టీజర్ విడుదలైంది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఆన్ లైన్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో దీన్ని రిలీజ్ చేయనున్నారు. టీజర్ లో వెంకీ ఓ పెద్ద డాన్ లా ప్రేక్షకులను అలరిస్తారు. అతడితో ఫైట్ చేసే అధికారిగా రానా కనిపిస్తూ అందరికీ ట్విస్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం విడుదల ప్రమోషన్లలో వీరిద్దరూ బిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణలు జరిగాయి. వెంకటేశ్ తనదైన శైలిలో కామెడీ పండించాడు. రానా కూడా దాన్ని కొనసాగించే ప్రయత్నం చేశాడు.
ఆసక్తికరంగా రానా-వెంకీ కాంబో..
వెంకటేశ్, రానా కలయికలో వెబ్ సిరీస్ విడుదల అంటే ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకుంటున్నారు. వీరిద్దరి మధ్య ఇప్పటి వరకు సినిమా రాకపోవడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరు ఏ స్థాయిలో నటిస్తారో తేలుతుందంటున్నారు. ఇప్పటికే అనేక చిత్రాల్లో హీరోగా రానా ప్రూవ్ చేసుకున్నాడు. లీడర్, బాహుబలి చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు రానా. బాహుబలితో అయితే ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇక వెంకీ గురించి, తన నటన గురించి, కామెడీ టైమింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.
Rana:
వీరిద్దరి కలయికలో భాగంగా వస్తున్న వెబ్ సిరీస్ లో రానాకు తండ్రిగా, కాన్ మన్ గా కనిపిస్తారని సమాచారం. తండ్రిని మరచిపోవడానికి నిరాకరించే పాత్రలో రానా కనిపించారు. ఆ ఇద్దరి మధ్యా వైరం ఏంటనేది ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారింది. రానా, వెంకీ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందంటున్నారు ఫ్యాన్స్. వెంకీ కొత్తగా ప్రయోగం చేశాడని చెబుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రానాను ఆఫ్ ద స్క్రీన్ బాగా ప్రేమిస్తానని, తనను ఎవరూ ద్వేషించలేరని వెంకీ పొగిడాడు. దీంతో వీరిద్దరి అనుబంధం గురించి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.