డార్లింగ్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీని ఆవిష్కరిస్తున్నారు. ఇక మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథఉండబోతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. కంప్లీట్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో ఈ కాన్సెప్ట్ ని ప్రశాంత్ నీల్ సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటి వరకు చూడని సరికొత్త వాతావరణంలో పీరియాడిక్ టచ్ తో సలార్ కథ ని దర్శకుడు చెప్పబోతున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తండ్రి కొడుకులుగా రెండు భిన్నమైన పాత్రలలో కనిపిస్తాడు అని తెలుస్తుంది. అలాగే టూ జెనరేషన్స్ మధ్య నడుస్తుందని టాక్. ఈ మూవీలో తండ్రికి విలన్ గా జగపతిబాబు నటిస్తూ ఉండగా, కొడుకుకి విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శనం ఇవ్వబబోతున్నాడు.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వారి పాత్రలకి సంబందించిన లుక్స్ ని దర్శకుడు ప్రశాంత్ రివీల్ చేశాడు. వరదరాజ మున్నార్ పాత్రలో చాలా భయానకంగా పృథ్వీరాజ్ కనిపిస్తున్నాడు. ఇక జగపతి బాబు కూడా నోట్లో చుట్ట పెట్టుకొని ముసలి గెటప్ లో కనిపించిన లుక్ ని రివీల్ చేశారు. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా ఒక సముద్రం అంచున ఉన్న గ్రామాన్ని నిర్మించారు. అలాగే సముద్రం సెట్ కూడా ఏకంగా పదికోట్లని నిర్మించారు. ఈ సెట్ సరికొత్త లుక్స్ తో రెట్రో స్టైల్ లో కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కాన్సెప్ట్ గురించి ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఈ మధ్య కాలంలో సినిమాలలో స్పిర్చువల్ ఎలిమెంట్ ని టచ్ చేస్తున్నారు. కార్తికేయ 2, అఖండ, బ్రహ్మాస్త్ర, రామ్ సేతు సినిమాలు అన్ని కూడా అలా హిందువులతో కనెక్ట్ అయ్యే ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన కథలే. ఇలాంటి కథలకి ప్రేక్షకులు కూడా పట్టం కడుతున్నారు. ఈ నేపధ్యంలో సలార్ సినిమాలో కూడా దైవాన్ని ప్రశాంత్ నీల్ ఇన్వాల్వ్ చేసినట్లు తెలుస్తుంది. కాళీమాత విగ్రహం చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందని తెలుస్తుంది. అయితే అది ఎలా ఉంటుందనే దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. కాని కాన్సెప్ట్ లో మాత్రం కాస్తా స్పిరిచువల్ ఎలిమెంట్ ని మిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.