POLITICS: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తనదైన శైలిలో రాజకీయంగా ముందుకు దూసుకుపోతున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఎంతో సన్నిహిత్యం ఉన్న విజయసాయి రెడ్డి ప్రస్తుతం వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నాటి నుండి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెన్నంటి ఉంటున్నారు విజయసాయిరెడ్డి. మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు వ్యూహాలు రచిస్తూ రాజకీయ వ్యూహాలు వేస్తున్నారు.
ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీని ముప్పు తిప్పలు పెట్టడంలో విజయసాయి రెడ్డి ముందు ఉంటారు. ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తూనే ఉంటారు. కేంద్రప్రభుత్వ పెద్దలతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ ఎవరూ ఊహించని రాజకీయాలు చేస్తూ వైసీపీకి ఉపయోగపడే రాజకీయాలను తెరవెనుక చేస్తూ ఉంటారు. దీంతో ఏపీ రాజకీయాలు ఎప్పటికప్పుడు రసవత్తరంగానే కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటే ఈనాడు పత్రిక విజయసాయి రెడ్డికి కుటుంబానికి సంబంధించిన వారి ఆస్తులపై వరుస కథనాలు వేస్తూ వస్తుంది. విశాఖలో విజయసాయిరెడ్డి కుటంబసభ్యుల సంబంధించి భూముల విషయాలను ప్రస్తావిస్తూ కథనాలను వడ్డివారిచింది ఈనాడు పత్రిక. దీంతో విజయసాయి రెడ్డి ఈనాడు పత్రికను విమర్శిస్తూ ప్రతిదాడి మొదలు పెట్టడం స్టార్ట్ చేశారు. అనేక సార్లు విజయసాయి రెడ్డి మాత్రమే కాదు సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా రామోజీని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. ే
ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో రామోజీరావు, ఈనాడు పత్రికను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. 10.8.1974 “ఈనాడు” తొలి సంచిక సంపాదకీయంలో ఎబికె ప్రసాద్ గారు రాశారు. “ఇది మీ పత్రిక. ప్రజాశక్తికి మించిన బలం మరొకటి లేదు. ఆ శక్తికి నిష్పాక్షికంగా అక్షరరూపం ఇచ్చి నిలదొక్కుకోవాలని “ఈనాడు” ఆశిస్తోంది”.
కానీ, ఈరోజు అది ఒక కులపత్రికగా ఒక పార్టీకి కరపత్రంగా మారడం దురదృష్టకరం అంటూ సంచలన ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి.