Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు ఆరో వారం నేటితో పూర్తి కానుంది.ఇక శనివారం హోస్ట్ నాగార్జున వచ్చారు. కొన్ని వీడియోలు చూపించారు. కొందరికి పీకాల్సిన క్లాస్ సుతిమెత్తగా పీకారు. ఇక వీడియోలలో భాగంగా బాలాదిత్యను పిలిచి ఒక వీడియో చూపించారు. సిగిరెట్‌కి సంబంధించి అసలు బిగ్‌బాస్ ఏం చెప్పారు? దానిని గీతూ ఎలా మార్చి చెప్పిందనే దానికి సంబంధించిన వీడియోను బాలాదిత్యను కన్ఫెషన్ రూంలోకి పిలిచి చూపించారు. మరి దీనికి మన బాలాదిత్య అంతో ఇంతో కోపం పెంచుకుంటే రేలంగి మామయ్య ఎలా అవుతాడు?
బాలాదిత్య కన్ఫెషన్ రూంలోకి వెళ్లి వీడియో చూసి తొలుత షాక్ అయ్యాడు. కేవలం షుగర్ మాత్రమే బ్యాన్ అని బిగ్‌బాస్ చెబితే గీతూ కిచెన్ మొత్తం అన్నట్టుగా చెప్పింది. దీంతో బాలాదిత్య సిగిరెట్స్ శాక్రిఫైస్ చేశాడు. అయితే ఈ వీడియో చూసిన తరువాత కూడా బాలాదిత్య ఏమాత్రం ఫైర్ అవలేదు. చాలా కూల్‌గా పోనీలెండి షుగర్ అయినా కూడా హౌస్ మొత్తం ఇబ్బంది పడాలి కదా. దానికంటే తనొక్కడే ఇబ్బంది పడటం బెటర్ అన్నట్టుగా చెప్పాడు. ఒకవేళ షుగర్ మాత్రమే అని చెప్పినా కూడా నేను స్మోకింగ్‌ను శాక్రిఫైస్ చేసేవాడిని అని చెప్పాడు.
బాలాదిత్య చేత స్మోకింగ్ మాన్పించాలి అనగానే గీతూ చిటికె వేసింది. దీనిని కూడా బాలాదిత్య చాలా పాజిటివ్‌గా తీసుకున్నాడు.‘నా అన్నతో స్మోకింగ్ మాన్పించే ఛాన్స్ వచ్చింది’అన్న ఉద్దేశ్యంతోనే గీతూ అలా చేసిందని బాలాదిత్య చెప్పుకొచ్చాడు.గీతూ మరి అలాగే భావించి చేసిందో లేదంటే బాలాదిత్యను ఎలాగైనా ఆటపట్టించాలని అలా చేసిందో కానీ మన రేలంగి మామయ్య మాత్రం గీతూ పనిని చాలా పాజిటివ్ వేలో చూడటం అతని క్యారెక్టర్‌కు నిదర్శనం. తనకోసం హౌస్ మొత్తం షుగర్‌ను శాక్రిఫైస్ చేస్తుందని ముందుగానే గెస్ చేసి ఫుడ్ మొత్తం అని గీతూ చెప్పిందని బాలాదిత్య చెప్పడం వాహ్ అనిపించింది.బిగ్‌బాస్ సీజన్ 6 చివరి వరకూ ఉన్నా లేకున్నా కూడా బాలాదిత్య మాత్రం తన మార్క్‌ను వేసేశాడు.