Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు ఆరో వారం కూడా నేటితో పూర్తి కానుంది. 5 వ వారం వరకూ టాప్ 5లో వీరుంటారని అనుకున్న వాళ్లంతా నెక్ట్స్ నామినేషన్‌కు వస్తే ఉంటారో ఉండరోననే సందిగ్ధం నెలకొంది. కొందరి బిహేవియర్ పూర్తిగా మారిపోయింది.ఆట మీద కంటే ఇతర విషయాలపై కాన్సన్‌ట్రేషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక వీరిలో ముఖ్యంగా చెప్పుకోదగిన వ్యక్తి ఇనయా సుల్తానా. అమ్మడు వాదనలో పస లేకున్నా ఎదుటి వారిని ఏదో ఒకటి మాట్లాడేసి నోరు మూయించగలిగిన సత్తా మాత్రం ఉంది.
పైగా ఒకానొక సమయంలో అందరూ కలిసి ఇనయాను టార్గెట్ చేయడంతో ఆమెపై సింపతీ బాగా పెరిగిపోయింది.ఆరోహి ఉన్నంత వరకూ ఇనయ బాగానే ఉంది. ఆమె వెళ్లడమే ఆలస్యం. సూర్యను పట్టుకుని వదలడం లేదు. సూర్య ఎటు వెళితే అటు వెళుతూ తన కాన్సన్‌ట్రేష్ మొత్తాన్ని సూర్య పైకి డైవర్ట్ చేసింది. తనకు సూర్య అంటే క్రష్ అని పదే పదే చెబుతూ అవసరం ఉన్నా లేకున్నా హగ్గులు, ముద్దులతో హౌస్‌ను హీటెక్కించేస్తోంది. వీరిద్దరి వ్యవహారంపై బయట ట్రోల్స్ మీద ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె టాప్ 5లో ఉండాలని కోరుకున్న ఫ్యాన్స్ సైతం ప్రస్తుతం ఇనయాపై మండిపడుతున్నారు.
ఇక శనివారం హోస్ట్ నాగార్జున కూడా అమ్మడికి సుతిమెత్తగా క్లాస్ పీకారు. ఇనయకు డెడ్ ఇచ్చిన నాగ్.. స్టార్టింగ్‌లో గేమ్ మీద ఎక్కువగా కాన్సన్‌ట్రేట్ చేసే దానివి.. ఇప్పుడు గేమ్ మీద కంటే కూడా మనుషుల మీద కాన్సన్‌ట్రేషన్ ఎక్కువైందని చెప్పారు. ఆ సమయంలో ఆడియన్స్ అంతా కూడా యునానిమస్‌గా నాగ్ వ్యాఖ్యలను సమర్ధించారు. తన గేమ్‌పై కావల్సినంత ఫీడ్ బ్యాక్ వచ్చేసింది. దీనిని పాజిటివ్‌గా తీసుకుని.. జనం తన గురించి ఎలా అనుకుంటున్నారో గ్రహించి ముందుకెళితే ఇనయ టాప్ 5 పక్కా. లేదంటే నామినేషన్స్‌కి వస్తే ఇంటికి వెళ్లడం పక్కా.