డార్లింగ్ ప్రభాస్ హీరోగా హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో మాఫియా ఎలిమెంట్స్ తో ఈ సినిమా కథాంశం ఉండబోతుందని ఇప్పటికే రివీల్ చేశారు. ఇక ప్రభాస్ ఈ మూవీలో మాఫియా డాన్ అనుచరుడుగా ఉంటూ అతని ఎలా డాన్ గా ఎదిగాడు అనే కథతో సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయ్యింది. ఇదిలా ఉంటే సినిమాలో ప్రభాస్ లుక్ కూడా చాలా పవర్ ఫుల్ గా మాసివ్ గా ఉండబోతుందని ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో రివీల్ అయ్యింది.
ఇక జగపతిబాబు కూడా ఈ సినిమాలో కరుడుగట్టిన విలన్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ విలన్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక తాజాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా సలార్ సినిమా నుంచి పృథ్వీరాజ్ క్యారెక్టర్ లుక్స్ తో పోస్టర్ రివీల్ చేశారు. ఆ లుక్స్ లో మీదలో కడియాలు వేసుకొని, ముక్కుకి రింగ్ పెట్టుకొని చాలా భయానకంగా కనిపిస్తున్నాడు.
ఇక ఈ సినిమా సెప్టెంబర్ 23, 2023లో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ఆవిష్కరిస్తున్నారని మూవీలో క్యారెక్టర్ లుక్స్ చూస్తూ ఉంటే అర్ధమవుతుంది. దానికి తగ్గట్లుగానే సినిమాపైన కూడా భారీ హైప్ క్రియేట్ అవుతుంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా ఇలా విలేజ్ సెట్స్ ని కూడా వేయడం విశేషం.