Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో మనం పడుకునే మంచం మీద కొన్ని రకాల వస్తువులను పెట్టడం వల్ల కీడు జరుగుతుంది. మనకు అందుబాటులో ఉంది కదా, అని మంచం మీద ఇష్టం వచ్చినట్లు వస్తువులను పెడితే ఇంట్లోకి లక్ష్మీదేవి రాదట. ఇంతకీ వాస్తు ప్రకారం ఎలాంటి వస్తువులు ఇంట్లోని మంచం మీద పెట్టకూడదో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
బంగారం, బంగారు ఆభరణాలు:
ఇంట్లో మంచం మీద మనం తరుచూ బంగారాన్ని లేదంటే బంగారు ఆభరణాలను ఉంచుతూ ఉంటాం. ఇలా మంచం మీద పెట్టి, మనకు ఏది సూట్ అవుతుందా అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ వాస్తు ప్రకారం ఇలా పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల మళ్లీ మళ్లీ బంగారం కొనే శక్తి ఆ కుటుంబ సభ్యులకు ఎదురవుతుందట. బంగారాన్ని బీరువాలో ఉంచుకోవాలని వాస్తు చెబుతోంది.
పసుపు, కుంకుమ:
మంచం అంటే భోగస్థానం అని మనకు తెలుసు. అయితే ఈ స్థానంలో పవిత్ర వస్తువులను ఉంచకూడదు. కానీ కొంతమంది తెలియక మంచం మీద పవిత్రమైన పసుపు, కుంకుమలను పెడుతుంటారు. అలాగే పూజా సామాన్లను, పండ్లను, తమలపాకులను పెడుతుంటారు. కానీ ఇలా ఎన్నటికీ చేయకూడదు.
దేవుడి ఫోటోలు:
చాలామంది రాత్రి పడుకునే ముందు దిండు కింద దేవుడి ఫోటో పెట్టుకొని పడుకునే అలవాటు ఉంటుంది. అయితే ఎక్కువగా ఆంజనేయ స్వామి ఫోటోను దిండు కింద పెట్టుకుంటూ ఉంటారు. వాస్తు ప్రకారం ఇలా ఎప్పటికీ చేయకూడదు. దేవుడి ఫోటోలను మంచం మీద పెట్టడం కానీ, దిండ్ల కింద పెట్టుకోవడం కానీ అస్సలు చేయకూడదట.
Vastu Tips: ఆభరణాలు:
మంచం మీద ముత్యాలు, సాలగ్రామాలు, రుద్రాక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదట. అలాగే వజ్రాభరణాలు, వెండి ఆభరణాలను, మరకత ఆభరణాలను, పచ్చలను ఉంచకూడదట. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపద నశిస్తుందని వాస్తులో చెప్పబడింది.