Manchu Vishnu: ఈ ఏడాది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన అలయ్ – బలయ్ కార్యక్రమం ఎంత పెద్ద వివాదానికి దారి తీసిందో చెప్పనక్కర్లేదు.మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ గరికపాటి నరసింహారావు మధ్య జరిగిన చిన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. గరికపాటి ప్రవచనాలు ఇస్తున్న సమయంలోనే అటు మెగాస్టార్ ఫోటో సెషన్ కార్యక్రమాన్ని పెట్టారు. తన వద్దకు వస్తున్న అభిమానులను కాదనలేక ఆయన ఫోటోలు దిగడం ప్రారంభించారు. గరికపాటి వారి ప్రవచనాలను వినేందుకు ఎవరూ ఆసక్తి కనబరచలేదు. దీంతో ఆయనకు కాస్త కోపం వచ్చింది. మెగాస్టార్‌పై అసహనం వ్యక్తం చేశారు.
వెంటనే చిరు వచ్చి స్టేజ్‌పై కూర్చొన్నారు. ఇదంతా ఆ సమయంలో చాలా క్యాజువల్‌గా జరిగిపోయింది. కానీ ఆ తరువాత మెగా బ్రదర్ నాగబాబు ట్విటర్ వేదికగా చేసిన కామెంట్స్‌తో ఇదొక పెను వివాదంగా మారింది. మెగా ఫ్యాన్స్ అంతా సీన్‌లోకి ఎంటర్ అయిపోయారు. అటు ఇండస్ట్రీకి చెందిన కొందరు నటులు సైతం గరికపాటిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.గరికపాటికి ఫోన్ చేసి మరీ కొందరు క్షమాపణలు కోరారు. జరగాల్సిన రచ్చంతా జరిగాక చిరంజీవి స్పందించి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.
కానీ తాజాగా ఈ వివాదంలో మంచు విష్ణు స్పందించారు. అసలు అక్కడ ఏం జరిగిందో తనకు పూర్తిగా తెలియదని.. గరికపాటి ఏదో మాట్లాడారన్నారు. ఆ తరువాత చిరంజీవి ఫ్యాన్స్ ఏవేవో కామెంట్స్ చేశారని మాత్రమే తెలుసని.. అసలు సబ్జెక్ట్ తనకు పూర్తిగా తెలియదన్నారు.కానీ చిరంజీవి ఒక లెజెండ్ అని ఆయన కనిపించగానే ఆయనతో ఫోటో తీసుకునేందుకు అభిమానులు ఎగబడతారన్నారు. అభిమానుల అత్యుత్సాహాన్ని ఎవరూ ఆపలేరన్నారు.పెద్ద స్టార్స్ ఎదురు పడినప్పుడు ఫ్యాన్స్ ఎగ్జైట్‌మెంట్‌కు గురవడం సర్వసాధారణమని మంచు విష్ణు తెలిపారు.