విరాటపర్వం సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ వేణు ఊడుగుల ప్రేక్షకుల ముందుకి వచ్చి అనుకున్న స్థాయిలో హిట్ కొట్టలేకపోయాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ మూవీ కంటెంట్ కూడా బాగానే ఉంటుంది. అయితే ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి ఎందుకో రీచ్ కాలేదు. నిజజీవిత కథకి కాస్తా సినిమాటిక్ టచ్ ఇచ్చి నక్షల్స్ బ్యాక్ డ్రాప్ లో నడిచిన ప్రేమకథగా విరాటపర్వం సినిమాని దర్శకుడు ఆవిష్కరించాడు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి కూడా తనదైన నటనతో మెప్పించింది. రానా దగ్గుబాటి కూడా పవర్ ఫుల్ పాత్రలో మెరిశాడు. కథ మొత్తం హీరోయిన్ పాత్ర కోణం నుంచే నడుస్తుంది.
అయితే క్లైమాక్స్ లో హీరోయిన్ సాయి పల్లవి ప్రేమించిన వ్యక్తి చేతిలోనే చనిపోవడం అనేది ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదని రిజల్ట్ బట్టి తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఫ్లాప్ తో వేణు ఊడుగుల నెక్స్ట్ సినిమా కోసం చాలా టైం తీసుకున్నారు. ఇక తాజాగా నాగ చైతన్యకి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ మంచి స్టోరీని నేరేట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక వేణు చెప్పిన కథ చైతూకి బాగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేసాడని టాక్. వెంకట్ ప్రభుతో చేస్తున్న సినిమా కంప్లీట్ కాగానే సెట్స్ పైకి తీసుకెళ్దామని వేణుకి చైతూ మాట ఇచ్చినట్లు బోగట్టా.
ఈ నేపధ్యంలో ఫుల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకునే పనిలో దర్శకుడు పడ్డాడని ఇండస్ట్రీలో టాక్. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఫ్లాప్ దర్శకుడితో సినిమా ఒకే చేసి చైతూ తప్పు చేస్తున్నాడనే మాట అక్కినేని ఫ్యాన్స్ నుంచి వినిపిస్తుంది. అయితే వేణు చెప్పిన స్టొరీ లైన్ తో చైతూ ఇప్పటి వరకు సినిమా చేయలేదు. ఈ నేపధ్యంలో కచ్చితంగా ఇంటరెస్టింగ్ గా ఉంటుందని ఆయనకి ఒకే చెప్పినట్లు బోగట్టా.