గాయత్రిని తీసుకెళ్లడానికి వస్తాడు జోగయ్య శాస్త్రి. పాపకు బట్టలు కొనిస్తాడు విశాల్. దాంతో ఇంట్లో చిచ్చుపెడుతుంది కసి. సుమన గానవి తన పాప అనడంతో శాస్త్రి గారు అయోమయంలో పడతారు. గానవిని నువ్ ఎలా తీసుకొస్తావమ్మా అని శాస్త్రి ప్రశ్నిస్తాడు. విశాల్ కలగజేసుకుని మా ఇంటి విషయాలు మీకు అర్థం కావు. అడిగి ఆందోళన పడకండి అంటాడు. పాప ఏడుపు ఆపింది ఇక సంతోషంగా బయల్దేరమని చెప్తాడు దురంరద భర్త. వెళ్లేముందు నయని కూతురు గానవిని ఆశీర్వదించి వెళ్తానని శాస్త్రి అనడంతో.. సుమన కంగారుపడుతుంది. భార్యని టాపిక్ నుంచి డైవర్ట్ చేసేందుకు విక్రాంత్ బ్యాంక్‌కు వెళ్దామా అంటాడు. సరేనని వెళ్లిపోతుంది సుమన. విక్రాంత్ హడావిడి, శాస్త్రి గారి పొరపాటు అర్థం కావట్లేదంటూ అనుమానం వ్యక్తం చేస్తుంది తిలోత్తమ. విశాల్ కవర్ చేస్తూ గానవిని ఎత్తుకోమని నయనికి చెప్తాడు. పాపని, నయనిని ఆశీర్వదించి వెళ్లిపోతాడు శాస్త్రి. గానవిని దీపావళి రోజు కూడా తీసుకురమ్మని శాస్త్రిని కోరుతుంది నయని. వల్లభ అభ్యంతరం వ్యక్తం చేయగా.. విశాల్ తమ్ముడికి జవాబు చెప్తాడు. ఆ రోజుకు ఉన్న స్పెషాలిటి ఏంటో చెబుతాడు విశాల్.
హాసిని మాత్రం కుళ్లు జోకులు వేస్తూ నవ్వుతుంది. శాస్త్రి పాపని తీసుకుని నయనికి బాయ్ చెప్పమంటాడు. విశాల్ కూడా నాన్నా అని వెటకారం చేస్తారు వల్లభ, కసిలు. ఆ మాట తనకు తృప్తిగా ఉందంటాడు విశాల్. పాపని తీసుకుని శాస్త్రి వెళ్తుంటే గోడకు ఉన్న గాయత్రి ఫొటో వేళాడుతుంది. అది చూసి ఆశ్చర్యపోతుంది తిలోత్తమ. దీపావళికి నిజనిర్ధారణ అవుతుంది అని నయని అంటుంది. ఆధారాలు ఉన్నాయా అని కసి అడగ్గా.. అన్నీ ఉన్నాయి. సహాయం చేసిన వారికి కూడా శిక్షపడుతుంది అంటుంది. అదంతా పోలీసులు చూసుకుంటారు కానీ ముందు గాయత్రి వదిన జయంతిని, కంపెనీ వార్షికోత్సవాన్ని ఎలా జరుపుకుందామో చెప్పండి అంటుంది దురందర. ‘చాలా గ్రాండ్‌గా చేయాలి. ఎందుకంటే అమ్మ పునర్జన్మ ఎత్తిందని నమ్మిన నా భార్య కళ్లల్లో సంతోషం చూడాలి’ అంటాడు విశాల్.
సీన్ కట్ చేస్తే.. విశాల్ ల్యాప్ టాప్ బాగు చేస్తాడు. నయని వచ్చి మీరు ఇక్కడ ఉన్నారు కానీ మీ మనసు ఎక్కడో ఉందని అంటుంది. మీ మనసు 7 కిలోమీటర్ల దూరంలో ఉందంటుంది నయని. అక్కడ ఏం ఉందని కావాలనే అంటాడు విశాల్. నిజం చెప్పండి బాబుగారు.. మీరు గాయత్రి గురించి ఆలోచించడం లేదా అంటుంది భార్య. నిజమే నయని.. పాపని మర్చిపోలేకపోతున్నా. అందుకే ఈ పని చేస్తున్నా అంటాడు. నాకు కూడా అలానే ఉందంటుంది నయని. అంతలోనే అక్కడికి వస్తాడు విక్రాంత్. ల్యాప్ టాప్ బాగుచేశానని విష్ చెప్పగానే ఆనందంతో గంతులేస్తాడు తమ్ముడు. నీకేదో అయింది సుమనకు చెప్పి దిష్టి తీయించుకోమంటుంది వదిన. ఆ తర్వాత నయని, విశాల్‌లు దీపావళి రోజు పాప వస్తే సత్యం బయటపడుతుందని సంబరపడిపోతారు.
విక్రాంత్ ల్యాప్ టాప్ ఓపెన్ చేయగానే సుమన వస్తుంది. వర్క్ చేస్తుందా నాకివ్వండి. నాకు కొన్ని అనుమానాలున్నాయంటుంది. విక్రాంత్ నో చెప్పడంతో బలవంతంగా లాక్కుంటుంది సుమన. సరే తగలడు చూడు అంటాడు చివరకు. పాస్వర్డ్ అడగడంతో భర్తని అడుగుతుంది సుమన. కానీ విక్రాంత్ చెప్పడు. సుమన ఏవో పేర్లు కొట్టడంతో లాక్ అవుతుంది ల్యాప్ టాప్. అనుమానపు పక్షివే నువ్ అంటూ భార్యని తిట్టుకుంటాడు విక్రాంత్. కంపెనీకి వచ్చిన గుడ్‌న్యూస్‌ని భార్యతో షేర్ చేసుకుంటాడు విశాల్. స్వీట్ చేసి భర్తకు తినిపిస్తుంది నయని.
ఆ తర్వాత సీన్‌లో వల్లభ ‘ఏం ఆలోచిస్తున్నావ్’ మమ్మీ. పెద్దమ్మ జయంతి వేడుకల గురించా అంటాడు. కాదు శాస్త్రి గారు గాయత్రిని తీసుకెళ్లేటప్పుడు.. గానవిని వాళ్ల కూతురుగా విశాల్, నయని ఎందుకు మేనేజ్ చేశారు.. అని అనుమానం వ్యక్తం చేస్తుంది తిలోత్తమ. పిల్లలు లేకపోవడంతో అలా కవర్ చేసుకున్నారేమోనని వల్లభ చెప్పినా నమ్మదు తిలోత్తమ. హాసినితో నయని అంత క్లోజ్‌గా ఉన్నా.. ఆడపిల్లలు విషయంలోనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు అంటుంది తిలోత్తమ. ఆ తర్వాత గాయత్రి జయంతి ఉత్సవాలు జరగకూడదని ఆర్డర్ వేస్తుంది తిలోత్తమ. అది అడ్డుకోవాల్సిందే మీరేనంటుంది వల్లభ, కసిలతో. ఎలా స్టాప్ చేయాలో ఐడియా ఇవ్వండని అడుగుతుంది కసి. మరి జయంతి ఉత్సవాలు జరుగుతాయా.. లేదా? తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..