ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ నిర్మిస్తుంది. శృతి హాసన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కేజీఎఫ్ తరహాలో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మాఫియా నేపధ్యంలోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ మాఫియా కింగ్ గా ఉంటాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ వినిపిస్తుంది.
ఈ సినిమాలో క్లైమాక్స్ ఎపిసోడ్ లో 20 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందని, ఆ ఎపిసోడ్ కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏకంగా 10 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తుంది. భారీగా సముద్రంపై యాక్షన్ సీక్వెన్స్ గా దీనినితెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. పీరియాడిక్ నేటివిటీకి సింక్ అయ్యే విధంగా ఆ సెట్ వేసినట్లు తెలుస్తుంది. అలాగే కార్లు కూడా ఈ యాక్షన్ సీక్వెన్స్ లో ఉపయోగిస్తున్నారని సమాచారం. ఇక ఈ సీన్ ని చాలా గ్రాండియర్ గా తెరకెక్కించడానికి ప్రశాంత్ నీల్ సిద్ధం అవుతున్నట్లు టాక్.
ఇక ఈ సెట్ ని రామోజీ ఫిల్మ్ సిటీలోనే నిర్మించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ కూడా ఈ నెలలోనే స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. అలాగే ప్రాజెక్ట్ కె షూటింగ్ కూడా వచ్చే నెల నుంచి మళ్ళీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని టాక్. అలాగే ఆదిపురుష్ నుంచి మరో క్రేజీ అప్డేట్ ని ప్రేక్షకులకి అందించడానికి ఓం రౌత్ సిద్ధం అవుతున్నారు. ఇక వరుసగా నాలుగు ప్రాజెక్ట్స్ పై ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉన్నారు. ఓ వైపు ఈ సినిమా షూటింగ్స్ జరుగుతూ ఉంటే ప్రభాస్ రెబల్, బిల్లా 4కె మూవీస్ ని థియేటర్స్ లో రీరిలీజ్ చేశారు.