కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం బింబిసార. ఈ మూవీ తెలుగునాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. కళ్యాణ్ రామ్ కెరియర్ లో భారీ కలెక్షన్స్ సొంతం చేసుకున్న చిత్రంగా ఇది నిలిచింది. లాంగ్ రన్ లో ఇప్పటి వరకు ఈ మూవీ ఏకంగా 75 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. అలాగే కళ్యాణ్ రామ్ ఇమేజ్ ని కూడా ఈ మూవీ అమాంతం పెంచేసింది. భారీగా లాభాలు తీసుకొచ్చిన బింబిసార సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
సంయుక్త మీనన్, కేథరీన్ ఈ మూవీలో హీరోయిన్స్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి అద్బుతమైన హిట్ ని సొంతం చేసుకుంది. సిల్వర్ స్క్రీన్ పై అద్భుతమైన కలెక్షన్స్ తో ప్రేక్షకులని మెప్పించిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. కార్తికేయ2 మూవీ రీసెంట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ లోకి వచ్చి ట్రెండింగ్ లో నడుస్తుంది.
బింబిసార సినిమా డిజిటల్ రైట్స్ ని జీ5 సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక జీ5 ఛానల్ లో దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ మరోసారి ఓటీటీలో ఈ మూవీని చూడటానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ తో తెరకెక్కుతున్న అమిగోస్ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది. దీంతో పాటు డెవిల్ అనే మూవీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.