Sajid Khan: ఈ మధ్య కాలంలో సినిమా ప్రపంచంలో వినిపిస్తున్న మాట కాస్టింగ్ కౌచ్. అయితే ఇది ఒక ఇండస్ట్రీ కే పరిమితం కాలేదు. ప్రతి ఇండస్ట్రీ ని ఈ సమస్య వెంటాడుతుంది. అయితే ఈ సమస్య ఎప్పటి నుంచో ఉన్నా ఇప్పుడిప్పుడే అన్ని విషయాలు బయటికి వస్తున్నాయి. ఎందుకంటే అప్పట్లో వీటిని బయట పెట్టాలంటే మీడియా ముందుకు వచ్చి బయట పెట్టాల్సి వచ్చేది అలా ఎవరు సాహసం కూడా చేయలేకపోయారు. ఈ సోషల్ మీడియా వల్ల తాము చెప్పాలనుకున్న విషయాన్ని ధైర్యంగా ముందుకి వచ్చి తమ కాస్టింగ్ కౌచ్ వల్ల వారు పడిన బాధలు చెప్పుకుంటున్నారు.
ఒకప్పుడు టాలీవుడ్ లో శ్రీ రెడ్డి ఈ ఇష్యూ కోసం ఎంత గట్టిగా పోరాడిందో అందరికి తెలిసిందే. అప్పుడప్పుడు సింగర్ చిన్మయి కూడా ఈ ఇష్యూ పై స్పందిస్తూనే ఉంటుంది. అయితే కొంత మంది చెప్పుకునేందుకు ధైర్యం చేసినా మరి కొంత మంది మాత్రం ఈ కాస్టింగ్ కౌచ్ నుంచి తాము ఎదుర్కొన్న సమస్యలని చెప్పుకోవడానికి ధైర్యం చేయట్లేదు. అయితే ఇది ఒక ఇండస్ట్రీ కే పరిమితం కాలేదు అని మనకు తెలుసు. ప్రాంతం, భాష కి సంబంధం లేకుండా అన్ని సినిమా పరిశ్రమల్లో ఈ ఇష్యూలు ఇప్పటికీ అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి.
అలా ఈ ఇష్యూ పై ఇప్పుడు బాలీవుడ్ లో బుల్లి తెరకి చెందిన నటి స్పందించింది. అయితే ఈమె ఇప్పుడు ఒక డైరెక్టర్ పై కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన ఆరోపణలు చేసింది. అతను ఏ అమ్మాయిని వదిలి పెట్టడని నాకు కూడా ఇలాంటి సమస్యే వచ్చిందని తెలిపింది. అలా కనిష్క సోని అనే బాలీవుడ్ బుల్లి తెర కి చెందిన నటి సాజిద్ ఖాన్ అనే దర్శకుడి పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది.
Sajid Khan:
అయితే ఈ విషయాన్నీ ఇప్పుడే ఎందుకు బయట పెట్టాల్సి వచ్చిందంటే తాను బిగ్ బాస్ షో లో ఇప్పుడు కాంటస్టెంట్ గా ఉండడమే. అయితే ఈ దర్శకుడి పై చేసిన ఆరోపణలు ఇప్పుడు బాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి. ఒక సారి ఏకంగా తన టాప్ ఎత్తి నడుముని చూపించమన్నాడని తన గోడుని సోషల్ మీడియా లో చెప్పుకుంది. ఇంకా తన స్టాఫ్ ముందే చాలా హీనంగా ప్రవర్తిస్తాడని, తన ప్రైవేట్ పార్ట్ ని చూపించి రేటింగ్ అడుగుతాడని తనపై దారుణమైన కామెంట్స్ చేసింది.