Nabha Natesh: హీరోయిన్ నభా నటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నన్ను దోచుకుందువటే అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ నభా నటేష్. భారీ అంత నల్ల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు అనుకున్న విధంగా గుర్తింపు దక్కలేదు.
ఈమె తెలుగుతో పాటు కన్నడ సినిమాలలో కూడా నటించి మెప్పించింది. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ కి జోడిగా నటించిన ఈ అమ్మడు ఈ సినిమా తో భారీగా గుర్తింపు పొందింది. ఆ సినిమా మంచి హిట్ అవటంతో ఈ ముద్దుగుమ్మకీ వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.
ఈ నేపథ్యంలోనే..సోలోబ్రతుకే సో బెటర్, డిస్కో రాజ, అల్లుడు అదుర్స్ లాంటి సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలు ప్లాప్ అవ్వటంతో అప్పటి నుండి సినిమా అవకాశాలు తగ్గాయి. అవకాశాలు తగ్గినప్పటికీ ఈ అమ్మడు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాల ఆరబోతతో సినిమా అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఎంతగా అందాలను ఆరబోసినా కూడా తగిన ఫలితం దక్కడం లేదు. అందాల ఆరబోతకు అభిమానులు పెరుగుతున్నారే తప్ప అవకాశాలు మాత్రం రావడం లేదు.
దీంతో ఈ ముద్దుగుమ్మ ఈ విషయం పట్ల కాస్త నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో ఈమె అందాల ఆరబోత విషయంలో కాస్త డోస్ ని పెంచేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఆ ఫోటోలలో ఈమె బ్లాక్ కలర్ టాప్ జీన్స్ ఫ్యాంటుని ధరించి వితౌట్ మేకప్ లో రకరకాల యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. వితౌట్ మేకప్ లో కూడా ఈ ముద్దుగుమ్మ అందం ఏమాత్రం తగ్గలేదు. వితౌట్ మేకప్ లో కూడా ఈమె అందంగా ఉంటుంది అన్నది ఫోటోలతో నిరూపితమైంది.