Healthy Food: ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి మళ్లీ భోజనం లేదా చపాతీ… చాలా మంది డైలీ ఫుడ్ మెనూ ఇలా ఉంటుంది. వీరిలో కొంత మంది రాత్రి పూట భోజనానికి బ్రేక్ ఇచ్చి ఏ ఫలమో, జ్యూసో లాగిస్తుంటారు. అయితే, ఇలాంటి డైలీ రొటీన్ ఫుడ్ తో బోర్ కొడుతోందా? కొత్తగా ఆరోగ్యాన్ని పాడు చేయని ఫుడ్ ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే.. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనం ప్రొటీన్లు కలిగిన ఆహారం తీసుకోవాలి.
పోషక విలువలున్న ఫుడ్ తీసుకుంటేనే మనకు అనారోగ్యం దరిచేరకుండా ఉంటుంది. వాస్తవానికి రోజువారీ మనం తీసుకొనే ఫుడ్ లో చాలా రకాల వాటిలో అనారోగ్యం కలిగించే పదార్థాలుంటాయి. ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్ లాంటివి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. రోగనిరోధక శక్తి తగ్గి, జబ్బులు త్వరగా సోకుతాయి. కండబలం, మెమొరీ పవర్ తగ్గుతుంది. అందుకే ఆయిలీ ఫుడ్ ను అవాయిడ్ చేయాలి.
కూరగాయలు, పండ్లు, గింజలు, మొలకలు లాంటివి రోజూ తినేలా ప్లాన్ చేసుకోవాలి. వీటి ద్వారానే మనకు ఆరోగ్యకర జీవితం సాధ్యమవుతుంది. రోజూ ఏదో ఒకరమైన వంటలో విటమిన్ సి కలిగిన నిమ్మకాయ ఉండేలా చూసుకోండి. దంతాలు ఎముకల బలం పెంచుతుంది. క్యాన్సర్ కణాలను నివారించే శక్తి కూడా నిమ్మకాయకు ఉంది. పచ్చి బఠాణీలు కూడా హెల్తీ ఫుడ్. జింక్, ఐరన్, ఖనిజాలు ఉంటాయి. వీటితోపాటు రోజుకో గుడ్డు ఉడికించి తింటే ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి.
Healthy Food:
రోజుకో యాపిల్ పండు తిన్నా ఉపయోగమే. దీంతో పాటు రోజూ దాదాపు మూడు లీటర్ల నీరు తాగుతుండాలి. అప్పుడే శరీరంలో మనం తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అవుతుంది. ఆప్రికాట్లు తీసుకోవడం వల్ల విటమిన్ బీటా కెరోటిన్, పొటాషియం, లైకోపిన్, ఫైబర్ లభిస్తాయి.