Betel Leaves: తమలపాకుతో ఉపయోగాలు అనేకం. అటు పూజల్లోనూ, ఇటు తాంబూలంలోనూ తమలపాకుది విశిష్ట పాత్ర. అనేక ఔషధ గుణాల సమాహారం తమలపాకు. భోజనం తిన్నాక దీన్ని కలిపి తాంబూలం వేసుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. పూర్వీకులు ఇలా చేసేవారు. ఇలా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మన ఆరోగ్యాన్ని రిపేర్ చేయడంలోనూ తమలపాకులు సహకరిస్తాయి. అనారోగ్య సమస్యల్ని పారదోలుతాయి.
పెళ్లిళ్లు, వేడుకలు, శుభకార్యాలకు వెళ్లినప్పుడు భోజనాలు అయ్యాక తమలపాకులతో తాంబూలం ఇస్తుంటారు. వీటిని తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తమలపాకుల్లో నియాసిన్, కెరోటిన్, విటమిన్ సి, రైబోఫ్లావిన్, క్యాల్షియం తదితర పోషకవిలువలు ఉంటాయి. మన శరీరానికి ఇవి అవసరం. అనేక ఆలయాల్లో నిత్య పూజలు జరుగుతుంటాయి. పూజల్లో తమలపాకులు తప్పకుండా వాడుతుంటారు. అనంతరం వీటిని భక్తులకు అందజేస్తుంటారు.
హెడ్డేక్ తగ్గించడానికి తమలపాకులు బెస్ట్ ఔషధం. జీర్ణక్రియ పనితీరు మెరుగుపరిచేందుకు కూడా తమలపాకులు ఉపయోగపడతాయి. శరీర ఉష్ణోగ్రత పెరగడానికి చలికాలంలో ఎక్కువ మంది తమలపాకులు తింటుంటారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పొట్టలోని అనేక సమస్యలను పారదోలుతాయి. మలబద్ధకం సమస్యకు తమలపాకులు మంచి మెడిసిన్. రక్త ప్రసరణ బాగా జరిగేందుకు కూడా తమలపాకులు ఉపయోగపడతాయి.
Betel Leaves:
నిత్య జీవితంలో మనకు వచ్చే జలుబు, దగ్గు, ఒంట్లో నలతగా ఉండటం లాంటి సమస్యలను తమలపాకులు పటాపంచలు చేస్తాయి. ఆస్తమా, ఛాతి నొప్పిని కూడా తగ్గిస్తాయి. మన శరీరానికి ఫ్రీరాడికల్స్ అప్పుడప్పుడూ హాని కలిగిస్తుంటాయి. వీటి నుంచి రక్షణ పొందాలంటే తమలపాకులు దివ్యౌషధం. ఇవన్నీ సైన్స్ ప్రకారం తేలినప్పటికీ మన పూర్వీకులు తమలపాకుల ఉపయోగాలు ముందే చెప్పారు. 60 ఏళ్లు పైబడిన బామ్మలంతా దాదాపు ఎక్కువ మంది ఇప్పటికీ తమలపాకులు కలిపి ఆకు వక్క వేసుకోనిదే వారికి రోజు గడవదు.