T20 World Cup: ఆస్ట్రేలియా పరిస్థితులకు అలవాటు పడాలని కొన్ని T20 వరల్డ్ కప్ కొన్ని వారాల ముందే టీమ్ ఇండియా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది. తన మొదటి, రెండు ప్రాక్టీస్ మ్యాచుల్లో ఒకటి గెలిచి, రెండో మ్యాచ్ లో ఓడిపోయింది. ఈ రెండు మ్యాచుల ద్వారా కొంత ప్రాక్టీస్ దొరికినా తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో ప్రాక్టీస్ మ్యాచ్ లలో తలపడనుంది. దీంతో T20 వరల్డ్ కప్ ఆరంభానికి ముందే కావాల్సినంత ప్రాక్టీస్ టీమ్ ఇండియాకు లభించనుంది.
ఇప్పుడు టీమిండియా వీటిని అధిగమిస్తే T20 వరల్డ్ కప్ సాధించడం సులభతరమే అని చెప్పవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
బౌలింగ్ : T20 వరల్డ్ కప్ ఆరంభానికి ముందే బుమ్రా రూపంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడున్న బౌలర్ల ఫామ్ ను పరిశీలిస్తే కొంతమేర టీమిండియా శ్రమించాల్సి ఉంటుంది. డెత్ ఓవర్లలో బౌలర్ల ప్రదర్శన మరీ పేలవంగా ఉంటుంది. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా పేరున్న భువనేశ్వర్ కుమార్ ధారాళంగా పరుగులు ఇవ్వడం టీమిండియాను కలవరపెడుతుంది. అర్ష్ దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అక్షర్ పటేల్, చాహల్ బౌలింగ్ లో మంచిగా రాణిస్తే ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయవచ్చు.
ఫీల్డింగ్: ఈ మధ్యకాలంలో టీమిండియా ఫీల్డింగ్ సమస్య కలవరపెడుతుంది. ఆసియా కప్ లో సింపుల్ క్యాచులను సైతం జారవిడిచింది. దీంతో ఆసియా కప్ ఫైనల్ కి కూడా చేరలేకపోయాం. సౌత్ ఆఫ్రికాతో T20 సిరీస్ లో కూడా ఫీల్డర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఈ విభాగంలో కూడా టీమిండియా మెరుగ్గా రాణించి, ఫీల్డింగ్ చేస్తే T20 వరల్డ్ కప్ ను మనం సొంతం చేసుకోవచ్చు.
T20 World Cup:
గ్రౌండ్స్: సాధారణంగా ఆస్ట్రేలియాలో గ్రౌండ్ పరిమాణాలు చాలా పెద్దగా ఉంటాయి. బౌండరీ లైన్ దూరంగా ఉంటుంది. దీనిపై కొంత కసరత్తు చేస్తే టీమిండియా బ్యాటర్లు బంతిని బౌండరీ అవతలికి ఈజీగా దాటించవచ్చు. అస్ట్రేలియా మైదానాలకు తగ్గట్టు టీమ్ ఇండియా ఆటగాళ్లు తమ ఆటను మార్పు చేసుకోవాల్సి ఉంటుంది.