Cricket: క్రికెట్ ప్రేమికులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పొట్టి ప్రపంచ కప్ రానే వచ్చింది. టి20 ప్రపంచకప్ (T20 World Cup) నవంబర్ 16న ప్రారంభం అవ్వబోతుంది. కంగారూ దేశం ఆస్ట్రేలియా టి20 ప్రపంచకప్ కి ఆతిథ్యం ఇవ్వనుంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు తన జోరు చూపించి విశ్వవిజేతలుగా ఎదగాలని ఉవ్విళ్లూరుతుంది. ఈ నెల 16న మొదలయ్యే ప్రపంచ కప్ నవంబర్ 13 వరకూ కొనసాగనుంది.
ప్రపంచ కప్ లక్ష్యంగా బరిలో నిలుస్తున్న భారత్ జట్టు అందుకు తగ్గట్టుగానే నెట్స్ లో తీవ్ర సాధన చేస్తుంది. బ్యాటింగ్ విషయానికొస్తే, ప్రస్తుత సారధి రోహిత్ శర్మ,మాజీ సారధి విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించనున్నారు. ఇటీవల శతకం సాధించి విరాట్ ఫామ్ ని తిరిగి అందుకోవడం శుభ పరిణామం. ఇప్పటికే ఎన్నో రికార్డులను తమ వశం చేసుకున్నఈ మేటి క్రికెటర్లు ఒక రికార్డు విషయంలో తలబడుతున్నారు. భారత్ తరఫున టి20 ప్రపంచకప్ లో ఎక్కువ పరుగులు చేసిన క్రికేటర్ గా ఇద్దరు ఆటగాళ్లూ సమఉజ్జీలుగా ఉన్నారు. వీరిద్దరి పరుగుల మధ్య వ్యత్యాసం కేవలం రెండు పరుగులు మాత్రమే.
‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ భారత్ తరఫున టి20 ప్రపంచకప్ లలో ఇప్పటివరకూ 33 మ్యాచ్ లు ఆడి 847 పరుగులు సాధించాడు. శతకం సాధించలేకపోయినా రోహిత్ శర్మ 8 అర్ధ సెంచరీలు తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఈ ఫార్మెట్ లో రోహిత్ శర్మ అత్యధిక స్కోర్ 79 నాటౌట్ గా ఉంది.
Cricket:
‘ఛేజ్ మాస్టర్’ గా పేరుగాంచిన విరాట్ కోహ్లీ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకూ 21 మ్యాచ్ ల్లో భారత జట్టుకి ప్రాతినిధ్యం వహించిన ‘కింగ్ కోహ్లీ’ 10 అర్థ శతకాలు సాధించి 845 పరుగులు చేశాడు. మాజీ సారధి అత్యధిక స్కోర్ 89 నాటౌట్. ప్రపంచ కప్ త్వరలో మొదలవుతుండడంతో వీరిద్దరి మధ్యన పోటీ మరింత రసవత్తరం కానుంది.