సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ చిత్రంగా దీనిని ఆవిష్కరిస్తున్నట్లు రాజమౌళి ఇప్పటికే చెప్పారు. అలాగే యూనివర్శల్ కాన్సెప్ట్ తో వరల్డ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని ఈ కథని సిద్ధం చేసినట్లు కూడా చెప్పారు. ఈ మూవీలో వరల్డ్ అడ్వాంచర్ ట్రావెలర్ గా మహేష్ బాబు కనిపించబోతున్నాడు అనేది స్పష్టం చేశారు. ఇక ఈ మూవీ కోసం హాలీవుడ్ నటులని కూడా ఎంపిక చేస్తున్నారు. దానికోసం హాలీవుడ్ కాస్టింగ్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకున్నారు.
ఇక ఈ సినిమాలో విలన్ గా మాత్రం ఇండియన్ యాక్టర్ ని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది. అది కూడా సౌత్ ఇండియా నుంచి టాలెంటెడ్ యాక్టర్ కార్తీని మెయిన్ విలన్ గా తీసుకుంటున్నట్లు టాక్. ఇప్పటికే జక్కన్న కార్తీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాడని, అతను కూడా కథ వినకుండానే ఒప్పుకున్నట్లు టాక్. పాన్ వరల్డ్ చిత్రం కావడంతో తన మార్కెట్ కూడా వైడల్ అవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని కార్తీ రాజమౌళికి పచ్చజెండా ఊపినట్లు టాక్.
ఇక మహేష్ కోసం హీరోయిన్ గా హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని రంగంలోకి దించుతున్నాడని టాక్. ఈ క్యాస్టింగ్ సెలక్షన్ అంతా అయిపోయాక డిసెంబర్ లో అఫీషియల్ ఎనౌన్స్ చేయడంతో పాటు సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు అనేది క్లారిటీ ఇవ్వడానికి జక్కన్న సిద్ధం అయినట్లు తెలుస్తుంది. మరో వైపు ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ ప్రమోషన్ లో కూడా జక్కన్న బిజీగా యూఎస్ లో తిరుగుతున్నాడని సమాచారం. ఇక మహేష్ బాబు కూడా వీలైనంత వేగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీని పూర్తి చేసి జక్కన్న సినిమా కోసం లుక్ మార్చుకునే పనిలో ఉన్నారని ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట.