నయని బొమ్మకు సితార ఎంగిలి కాఫీ తాగిస్తుంది. దాంతో ఇంట్లో పెద్ద రాద్దాంతం జరుగుతుంది. ఆ తర్వాత తిలోత్తమ స్వామీజీ ఇచ్చిన రుద్రాక్ష మాలని తీసి పక్కన పెడుతుంది. అందుకే తన చీర కొంగుకు నిప్పు అంటుకుంటుంది. నయని తన అత్తయ్యని కాపాడుతుంది కానీ అప్పుడు సీన్ అంతా రివర్స్ అవుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 13 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
అత్తయ్య చావుని ఆపడం ఎవరి తరం కాదంటూ శోకాలు పెట్టి ఏడుస్తుంది హాసిని. గదిలోకి వెళ్లి పాపతో మాట్లాడుతుంది. నిన్న కూల్ వాటర్‌ని హాట్ వాటర్ చేశావ్.. ఇపుడు కూడా నువే నిప్పు పెట్టించావా? బేబీ అంటూ అడుగుతుంది పాపని. ఆ తర్వాత సీన్‌లో శాస్త్రి, స్వామీజీలు కలుసుకుని మాట్లాడుకుంటారు. ‘నేను అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పు’ అంటాడు స్వామీ శాస్త్రితో. ‘నీ కూతురుకు కూతురు పుట్టడమేంటి.. ఆ పాపని నువ్ గాయత్రి అని ప్రచారం చేయడమేంటి’ అని ప్రశ్నిస్తాడు. దాంతో క్లుప్తంగా వివరిస్తాడు జోగయ్య శాస్తి. శారద, గాయత్రి ఎవరు వీరిద్దరూ అని స్వామి అడగ్గా.. ‘శారద అసత్యం.. గాయత్రి నిర్మలత్వమైన సత్యం’ అంటూ గతాన్ని వెల్లడిస్తాడు శాస్త్రి. అపుడు కళ్లు మూసుకుని అంతా చూస్తాడు స్వామి. గాయత్రే నయని కూతురని స్వామికి, నయనికి చెప్పకూడదనుకుంటాడు లోపల. ‘తల్లి పాల కోసం అబద్ధం ఆడాల్సి వచ్చింది’ అంటాడు శాస్త్రి. నువ్ చేసింది మంచి పనే. పాపని రేపు నీ మనవరాలుగానే తెచ్చుకో.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు స్వామీజీ.
సీన్ కట్ చేస్తే.. కాసి మీద చేయి చేసుకున్నందుకు వల్లభ తనకి సారీ చెబుతాడు. మాల విసిరేయడం నాదే తప్పంటుంది కసి. మరోవైపు నయని అమ్మవారికి పూజ చేస్తుంది. అందరూ అక్కడికి చేరుకుంటారు. నయనమ్మ హారతి ఇవ్వకుండా గంటకొట్టిందేంటి అంటాడు దురందర భర్త. అగ్గి ముట్టించకూడదు కద బాబాయి అని గుర్తుచేస్తుంది నయని. అపుడే నయనితో కసి సూటిపోటి మాటలంటుంది. విశాల్ వచ్చి నమ్మకం లేని వాళ్లతో చర్చ అనవరం నయని అంటూ సమర్దిస్తాడు. పాపకు డ్రెస్ మార్చమని తీసుకుస్తాడు విశాల్. అందరికీ బొట్టు పెట్టిన తర్వాత మారుస్తానంటుంది నయని. అపుడే తిలోత్తమ కొడుకుతో నేను మారుస్తాలే. పాపని ఇవ్వు అంటుంది. ఆ సమయంలో నయనికి ఏదో కనిపిస్తుంది. బాబుగారు పాపని అత్తయ్యకు ఇవ్వకండి అంటుంది. ఎందుకు, ఏమైంది అని అడిగినా వద్దంటుంది నయని. ఎవరో కన్న కూతుర్ని అత్తయ్య ఎత్తుకోకూడదని షరతు పెట్టడమేంటని అంటుంది సుమన. అలా తిలోత్తమ కూడా ఫీలవుతుంది. ఇష్టం లేకపోతే మొహం మీదే చెప్పచ్చు కదా అంటుంది. విశాల్ భార్యని సమర్ధించడంతో తిలోత్తమ కోప్పడుతుంది. ‘దీపారాధన, హారతి, కనీసం అగరబత్తి లేకుండా పూజ చేసింది నువ్. మళ్లీ నాకు గండం ఉందని ఆటబట్టిస్తున్నావా’ అంటుంది నయని. ఇపుడ పాపని ఎత్తుకోవద్దు అన్నాను.. అది నా ఇష్టం అని నయని చెప్పగా అయితే నీది నువ్ చూసుకో అంటుంది తిలోత్తమ. మీకే తలకొరివి పెట్టాల్సి వస్తుందని మొహం మీదే చెప్పేస్తుంది నయని. దాంతో అందరూ షాకవుతారు.
చావు ఏదో నీ చుట్టమైనట్టు ఎందుకు నాటకాలు ఆడుతున్నావని అరుస్తుంది తిలోత్తమ. ముందు ఈ బొట్టు పెట్టుకోండి అని నయని తీసుకురాగా.. నువే పెట్టుకోవే అంటూ నయని మీదికి విసిరేస్తుంది. దాంతో తన మొహమంతా కుంకుమతో నిండిపోతుంది. నయని మాత్రం అమ్మవారి కుంకుమ మీ చేతులకు అంటుకునేలా చేశానని అనుకుంటుంది. అత్త, కోడళ్లు కొద్దిసేపు పోట్లాడుకుంటారు. నువ్ వద్దన్న పని నేను చేస్తా.. గాయత్రిని ఎత్తుకుంటానని తీసుకుంటుంది పాపని. కొద్దిసేపు ఆగి విశాల్‌కి తిరిగిస్తుంది. ఆ తర్వాత గానవిని ఎత్తుకుంటుంది. ఇపుడు చెప్పు చీర కాలితే అరిష్టమన్నావ్ కదా ఏమైందంటూ రెచ్చగొడుతుంది. నయని మాత్రం ఏం మాట్లాడదు.
మరసటి రోజు ఉదయం సుమన విక్రాంత్ దగ్గరికి వెళ్లి తన అక్క నయనిని ఆడిపోసుకుంటుంది. అలా భార్యాభర్తలిద్దరూ కాసేపు పోట్లాడుకుంటారు. తిలోత్తమ చావు గురించి మాట్లాడుకుంటారు. నయనికి నోటి దురుసుందంటూ తిడుతుంది. విక్రాంత్ మాత్రం వదినని సమర్థిస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..