Bigg boss 6: బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు.. ఆరో వారం కూడా పూర్తి కావొచ్చింది. ఇప్పటి వరకూ హౌస్‌లో తదుపరి కెప్టెన్‌ను ఎన్నుకొన్నదే లేదు. దానికోసం ఏమైనా టాస్కులు ఆడిస్తున్నాడా? అంటే అదీ లేదు. కంటెస్టెంట్స్ అంతా ఊడబొడిచి అలసిపోయారనో.. లేదంటే వీళ్ల నుంచి ఎలాగూ కంటెంట్ వచ్చే సూచనలు కనిపించడం లేదు కాబట్టి ఏదో ఒక రకంగా కంటెంట్ రాబట్టుకుందామనో కానీ బిగ్‌బాస్ స్వయంగా బ్యాటరీ రీచార్జ్ టాస్క్ ఒకటి ఇచ్చి వారి ఎమోషన్స్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డాడు. మూడు రోజుల పాటు దీన్నే నడిపించాడు. రాత్రితో ఫుల్ స్టాప్ పెట్టేశాడు.
ఇక హౌస్‌లో ఉన్న వాళ్లలో కాస్త బాగా ఆడే వాళ్లలో రేవంత్ ఒకడు. టాస్క్‌లు బాగా ఆడతాడు. అంతకు ముందున్న పాపులారిటీ తప్ప ఏముంది రేవంత్‌కి..? అసలు అందరూ టార్గెట్ చేయకుంటే రేవంత్ అనే వ్యక్తి నథింగ్ అసలు. కనీసం శ్రీరామ చంద్ర మాదిరిగా సాంగ్స్ పాడుతూ ఎంటర్‌టైన్ చేయడమూ లేదు. అతని మాదిరిగా అందరితో సఖ్యతా లేదు.సౌమ్యంగా ఉండటం లేదు. స్ట్రాటజీలు అంతకన్నా లేవు. ఏదో ఏ వృక్షమూ లేని చోటు గానుగ చెట్టే మహా వృక్షం అన్నట్టుగా అయిపోయింది రేవంత్ పరిస్థితి.
అసలే హౌస్‌లో ఫుడ్ తక్కువగా ఉంటుంది. ఆదిరెడ్డి వంటి వాళ్లకు ఫుడ్ అసలు సరిపోదు. ఆ మాటకు వస్తే రేవంత్‌కి సైతం ఫుడ్ సరిపోక గతంలో వాదనలకు దిగాడు. ఇక నిన్న తనకు అన్నం సరిపోవడం లేదని కాస్త ఎక్కువ వండమని కెప్టెన్ కమ్ రేషన్ మేనేజర్ అయిన రేవంత్‌ను ఆదిరెడ్డి ప్రశ్నించాడు. దానికి రేవంత్ రైస్ వేస్ట్ కాకూడదంటూ యథావిధిగా కస్సుబుస్సులాడాడు.దీనికి ఆదిరెడ్డి.. నీ కెప్టెన్సీలో అన్నం లేక ఇబ్బంది పడటం మీకు ఇష్టమా? అని రేవంత్‌ని ప్రశ్నించాడు. మీరు ఇబ్బంది పడ్డారా? అంటూ ఫైర్ అయ్యాడు రేవంత్. రైస్ ఎక్కువగానే ఉంది కదాని అడిగానని ఆదిరెడ్డి చెబుతున్నా మనోడికి ఎక్కలేదు. రైస్ ఎక్కువ ఉన్నప్పుడు కాస్త సరిపడా ఫుడ్ పెడితే ఏమవుతుంది? ఫుడ్ విషయంలో అలా చేస్తే రేవంత్‌కి ఎంత మైనస్ అవుతుంది? అవేమీ ఆలోచించకుండా రేవంత్ చేసే పనులకు నెగిటివిటీ పెరగడం తప్ప మరొక ప్రయోజనం ఉంటుందా?