Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇచ్చిన హౌస్ రీఛార్జ్ టాస్కులో రోజుకో ట్విస్టు నెలకొంటూ వస్తోంది. బాలాదిత్య తన భార్యతో మాట్లాడుకోవడానిక అవకాశం కోరడంతో బ్యాటరీ రీఛార్జ్ సున్నాకు పడిపోతుంది. బాలాదిత్య తన భార్యతో ఎంతో ఎమోషనల్ గా మాట్లాడతాడు. కానీ హౌస్ సభ్యులు అవకాశం రాని వారు మాత్రం తెగ ఫీల్ అవుతారు. ఎందుకు బాలాదిత్య అలా చేస్తున్నాడు అని అందరూ తెగ ఫీల్ అవుతారు. అసలు బిగ్ బాస్ మరలా రీఛార్జ్ చేసుకునేందుకు అవకాశం ఇస్తాడో లేదో అని ఖంగారు పడుతూ ఉంటారు.
మొత్తానికి బిగ్ బాస్ నుండి ఫోన్ కాల్ వస్తుంది. బ్యాటరీ రీఛార్జ్ చేసుకునేందుకు అవకాశం ఇస్తాడు. కానీ బిగ్ బాస్ అందుకోసం కొత్త ఫిట్టింగ్ పెడతాడు. దీంతో హౌస్ లో అందరూ షాక్ కాసేపు ఖంగారు పడతారు. ఇంతకీ బిగ్ బాస్ ఏం చెప్పాడనేగా మీ సందేహం… అక్కడే వస్తున్నా…. హౌస్ రీఛార్జ్ అవ్వాలంటే వాసంతి, రోహిత్ ఇద్దరిలో ఎవరో ఒకరు హౌస్ లో నుండి బయటికి వెళ్లేందుకు రెండు వారాల పాటు నేరుగా నామినేట్ అవ్వాల్సి ఉంటుందని చెప్తాడు.

దీంతో వారిద్దరినీ పక్కకి వెళ్లి మాట్లాడుకుని ఎవరు నామినేట్ అవడానికి ఒప్పుకుంటారో చర్చించుకుని రమ్మని హౌస్ మెంట్స్ చెప్తారు. వసంతి, రోహిత్ ఇద్దరూ పక్కకి వెళ్లి చర్చిస్తారు వసంతి ఎలాగోలా రోహిత్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. హౌస్ లో రోహిత్ భార్య మెరీన కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చర్చలో మెరీనా కూడా కలుగజేసుకుని ఎట్టకేలకు చివరికి రోహిత్ రెండు వారాల పాటు నామినేట్ అవ్వడానికి ఒప్పుకుంటాడు.
దీంతో రోహిత్ ను నేరుగా నామినేట్ చేయడం జరుగుతుంది. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో తక్కువ ప్రదర్శన చూపిస్తున్న వసంతి, రోహిత్ ను పంపించేందుకు బిగ్ బాస్ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికీ రోహిత్ నామినేషన్ లో ఉండటంతో వసంతి తప్పించుకుంది. మొత్తానికి వారిద్దరనీ హౌస్ లో పంపించేందుకు బిగ్ బాస్ మామూలు ఫిట్టింగ్ పెట్టలేదుగా…..!