శృతి హాసన్ కెరియర్ ఆరంభంలో అనగనగా ఒక ధీరుడు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందుగా హిందీలో హీరోయిన్ గా అడుగుపెట్టింది. అయితే ఆ సినిమాల సమయంలో శృతి హాసన్ రూపంలో కాస్తా తేడా ఉండేది. ఆమె ముక్ఖు కాస్త పొడవుగా ఉండటంతో ఆమెని హీరోయిన్ గా యాక్సప్ట్ చేయలేకపోయారు. అయితే గబ్బర్ సింగ్ సినిమాకి వచ్చేసరికి శృతి హాసన్ రూపంలో తేడా కనిపించింది. తరువాత తన అందంతో వరుస అవకాశాలని ఈ బ్యూటీ సొంతం చేసుకుంది. ఏకంగా స్టార్ హీరోలకి జోడీగా నటించే ఛాన్స్ లు సొంతం చేసుకొని టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపొయింది.
అయితే మధ్య మధ్యలో లవ్ ఎఫైర్స్ కారణంగా కొంతకాలం సినిమాలకి దూరమైనా మళ్ళీ క్రాక్ సినిమాతో బ్యాక్ టూ ఫామ్ అంటూ వచ్చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ వైపు బాలకృష్ణ, చిరంజీవి లాంటి సీనియర్ హీరోలతో నటిస్తూ ఉంది. మరో వైపు సలార్ సినిమాలో ప్రభాస్ కి జోడీగా నటిస్తుంది. ఇలా ఆమె చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక శృతి హాసన్ అందం కోసం తన ముక్కుకి సర్జరీ చేయించుకుంది అని అప్పట్లో చాలా విమర్శలు వినిపించాయి. తాజాగా ఆమె వాటిపై క్లారిటీ ఇచ్చింది.
కెరియర్ ఆరంభంలో తన ముక్కు చూడటానికి అంత బాగోని మాటని వాస్తవమే అయినా కూడా నేను కావాలని సర్జరీ చేయించుకోలేదని చెప్పింది. షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం కారణంగా ముక్కుకి గాయం అయ్యిందని, దాంతో సర్జరీ చేయించుకున్నా అని చెప్పి క్లారిటీ ఇచ్చింది. తాను ఏదైనా పని చేస్తే దాచుకునే రకం కాదని, కచ్చితంగా ఒప్పుకుంటా అని ఈ ముక్కు సర్జరీ వెనుక కథని శృతి హాసన్ రివీల్ చేసింది. ఏది ఏమైనా ఆ సర్జరీ హీరోయిన్ గా సక్సెస్ కావడంలో ఆమెకి ఎంతో ఉపయోగపడిందని చెప్పాలి.