దేవితో మాట్లాడడానికి స్కూల్ దగ్గరికి వెళ్తాడు ఆదిత్య. కానీ దేవి మాత్రం ఆ అవకాశం ఇవ్వదు. మరోవైపు జానకమ్మ ఎప్పటిలాగే రాధ గురించి బాధపడుతుంది. రాధ మాటల్ని విని మాధవ్ హ్యాపీగా ఫీలవుతాడు. ఆదిత్య, రాధలు ఊరి చివర కలవడం సత్య చూస్తుంది. ఆ తర్వాత అక్టోబర్ 13 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
రాధ, ఆదిత్యల్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటుంది సత్య. నువ్ చెప్పిందేంటి.. చేస్తుందేంటని రాధని నిలదీస్తుంది. ఆదిత్యకు మాట్లాడే అవకాశం ఇవ్వదు. రుక్మిణిని సూటిపోటి మాటలని బాధపెడుతుంది సత్య. దాంతో రుక్మిణి కుమిలి కుమిలి ఏడుస్తుంది. అక్కడినుంచి ఆదిత్యను వెంటతీసుకుని వెళ్లిపోతుంది సత్య. పాపం రాధ ఒంటరిగా మిగిలిపోతుంది అప్పుడు. చెల్లి మాటల్ని తలుచుకుని రుక్క వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆ తర్వాత సీన్‌లో రామ్మూర్తి జానకి దగ్గరికి వెళ్లి.. ‘నీకు ఇంత ఆస్తి ఇచ్చినా నీవాళ్లెవరో తెలుసుకోమంటున్నాడు ఆ దేవుడు. నీకు ఇలా అయితే మేం ఏమీ చేయలేకపోయాం. మనకు ఆడపిల్ల ఉన్నా ఇంత బాగా చూసుకునేది కాదేమో. ఏ జన్మల చేసిన పుణ్యమో నీకు రాధ ప్రేమ దక్కింది’ అంటూ ఎమోషనల్ అవుతాడు రామ్మూర్తి.
సీన్ కట్ చేస్తే.. మాధవ్ రాధ కోసం ఎదురుచూస్తుంటాడు. కావాలనే నన్ను రెచ్చగొట్టడానికే రాధ వెళ్లి ఉంటుందనుకుంటాడు. ప్రతీకారంతో రగిలిపోతాడు మాదవ్. ఆదిత్యని కలవకుండా రాధని ఎలా ఆపాలని ఆలోచిస్తాడు. అక్కడ స్కూల్లో దేవి గుళ్లో జరిగింది గుర్తుచేసుకుని మదనపడుతుంది. ఒంటరిగా కూర్చున్న దేవి దగ్గరికి వెళ్తుంది టీచర్. ‘దేవి హోం వర్క్ చేశావా. అసలు నీకు ఏమైంది. క్లాసులు కూడా వినట్లేదు. మీ నాన్న నెంబర్ చెప్పు నేనే మాట్లాడతా’ అని టీచర్ అంటుంది. దాంతో మా నాయన ఎవరో నాకు తెలియదు. నాకు తెలియనవి చాలా ఉన్నాయంటూ అరుస్తుంది దేవి. దాంతో టీచర్ కోపంతో ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్దాం పద అని తీసుకెళ్తుంటే రాధ వచ్చి ఏమైంది టీచరమ్మ అని అడుగుతుంది. జరిగిందంతా చెప్తుంది టీచర్. వాళ్ల అవ్వకు బాలేకపోవడం వల్ల అలా చేస్తుందని సర్ది చెబుతుంది రాధ. టీచర్ వెళ్లిపోయాక రాధ, చిన్మయిలు దేవిని మందలిస్తారు. నువ్ మంచిగా చదువుకోవాలని నచ్చచెప్తారు. నీకేమైంది బిడ్డా.. ఎందుకు ఇట్ల చేస్తున్నావని బాధపడుతుంది రాధ. చెల్లికి నేను చెప్తానమ్మా.. నువ్వేం బాధపడకంటుంది చిన్మయి. చెల్లిని తీసుకుని క్లాసుకు వెళ్తుంది.
ఆ తర్వాత సీన్‌లో ఆదిత్య దగ్గరికి వస్తుంది సత్య. ‘ఏమీ లేదు అంటూనే ఏకాంతంగా కలవాల్సిన అవసరం ఏముంది. నా చెల్లెల్ని బాదపెడతానా అంటు మా అక్క ఇచ్చిన మాట తప్పింది. అన్ని మర్చిపోయాను.. నిన్ను బాదపెట్టను సత్య అని చెప్పిన నువ్ ఇచ్చిన మాట తప్పావ్. అక్కడ ఉన్నది మా అక్కే అయిన పక్కన ఉన్నది నా భర్త’ అంటూ ఎమోషనల్ అవుతుంది సత్య. మీరిద్దరూ ఊరి చివరన ఏకాంతంగా కలిసి.. అని సత్య పూర్తి చేసే లోపు ఆదిత్య కోపంగా పైకిలేస్తాడు. ఏం జరిగిందో తెలుసుకోవల్సిన అవసరం లేదా అని అంటాడు భార్యతో. ‘నువ్ కలెక్టర్ ఆఫీసులో గుమస్తావి కాదు. కలెక్టర్‌వి. అలా సర్పంచ్ కోడలితో మాట్లాడితే చూసే వాళ్లు ఏమనుకుంటారు’ అని ఆదిత్యని ప్రశ్నిస్తుంది భార్య. ఇద్దరి మధ్య గొడవ తీవ్రస్థాయిలోనే జరుగుతుంది. సత్య మాటలకు ఆదిత్య లోలోపలే కుమిలి పోతాడు.
మరోవైపు రాధ ఒంటరిగా కూర్చుని అటు సత్య మాటల్ని.. ఇటు దేవి తీరును తలుచుకుని ఏడుస్తుంటుంది. రాధని చూసి అక్కడికి వస్తాడు రామ్మూర్తి. ‘ఏంటమ్మా.. అదోలా ఉన్నావ్’ అని అడగ్గా.. ఏం లేదు పటేలా అని కవర్ చేసుకుంటుంది రాధ. ఏమైందని ఎన్నిసార్లు అడిగినా రాధ నోరు విప్పదు. కానీ రామ్మూర్తి మాత్రం రాధ చేస్తున్న సేవల్ని గుర్తుచేస్తూ పొగడతాడు. ఇంత చేసిన నీకోసం ఏం చేయడానికైనా వెనకాడమంటూ భరోసానిస్తాడు రామ్మూర్తి. మరి రాధ మాధవ్ గురించి చెప్పేస్తుందా? తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..