సులోచనకు ఆక్సిడెంట్ చేసింది కైలాషేనని తెలిసి వేద, యశోదర్‌లు అభిమన్యు ఇంటికి వెళ్తారు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. చివరకు అభిమన్యుకు వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు యశ్. ఆ తర్వాత యశోదర్‌కు తన ఫ్రెండ్ ఫోన్ చేసి పార్టీకి రమ్మని పిలుస్తాడు. వేద కూడా సరేననడండతో ఇద్దరూ కలిసి వెళ్తారు. ఆ తర్వాత అక్టోబర్ 13 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
యశోదర్ తన ఫ్రెండ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు. అంతలోనే మాళవిక వస్తుంది అక్కడికి. రోజురోజుకీ నీ అందం పెరిగిపోతుందంటూ మాళవికని పొగడతారు తన ఫ్రెండ్స్. అపుడే మాళవిక.. యశోదర్, వేదల వైపు ఓ లుక్కేస్తుంది. వేదని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది మాళవిక. ఆ తర్వాత వేద దగ్గరికి వెళ్లి ‘హలో’ అని పలకరించి సూటిపోటి మాటలంటుంది. మగాడిని మెప్పించాలంటే ఆడదానికి ఉండాల్సింది మనసు కాదు సొగసు అంటూ హేళన చేస్తుంది. ఇప్పటికీ యశ్‌కి నా సొగసు మీద మనసు తీరలేదు. యశ్‌ని నేను వదిలేశాను కానీ యశ్ నన్ను వదిలేయలేదు. యశ్ నా పెంపుడు కుక్క. యశ్ భార్య స్థానం నాది. ఖుషీకి అమ్మని నేనే. నువ్ కేవలం ఆయావి అంటూ ఎగతాళి చేస్తుంది. దానికి వేద కూడా అంతే స్థాయిలో రిప్లై ఇస్తుంది. అపుడే వేదకి ఖుషీ కాల్ చేసి మాట్లాడుతుంది. ఆ మాటల్ని మాళవికకు వినిపిస్తుంది వేద. ఖుషీ మాటల్ని విని మాళవిక షాక్ అవుతుంది. వేద, ఖుషీల బందాన్ని చూసి కుళ్లుకుంటుంది మాళవిక. ‘ఒక కూతురు, అమ్మ మాట్లాడుకోవడం విన్నావ్’గా అంటూ స్ట్రాంట్ కౌంటర్ ఇస్తుంది వేద.
పూజకి పనికిరాని మిలమిల మెరిసే ప్లాస్టిక్ పువ్వువి నువ్వు అన్న వేద మాటలకు మాళవిక దిమ్మతిరిగిపోతుంది. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న వేద దగ్గరికి వెళ్తాడు యశ్. ‘మిస్సెస్ వేదశ్విని గారు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఒక పాట పాడాలనిపిస్తుంది’ అంటాడు. పాడండి అని వేద అనగా.. ‘ఇంతందంగా ఉన్నావే.. ఎవరే నువ్వు’ అంటూ పాట మొదలుపెడతాడు. మాళవికకి ఒళ్లు మండిపోయేలా చేస్తారు ఈ క్యూట్ కపుల్స్. అంతేకాకుండా ఆ పార్టీలో డ్యాన్స్ కూడా చేస్తారు. అది చూసి మాళవిక తట్టుకోలేకపోతుంది. బ్యూటీక్వీన్‌ని నేనుండగా ఆ పనికిమాలిన వేదని పట్టుకుని మురిసిపోతున్నాడు. ఈ యశోదర్‌కి మతిపోయింది అంటూ తిట్టుకుంటుంది.
సీన్ కట్ చేస్తే.. కాంచన కైలాష్ గురించి ఆలోచిస్తుంది. ఆక్సిడెంట్ చేసింది ఎవరో తెలుసుకోవడానికి సులోచన దగ్గరికి వెళ్తుంది. అంతలోనే మాళవిక జ్యూస్ తీసుకుని వచ్చి తాగిపిస్తుంది. కానీ సులోచన మాత్రం క..క.. అంటుంది. అదేంటో అర్థం కాదు మాళినికి. ఇదంతా చాటుగా గమనిస్తుంది కాంచన. ‘సులోచన నువ్ ఏమో చెప్పాలనుకుంటున్నావు. అదేంటో నాకు అర్థం కావట్లేదు’ అని బాధపడుతుంది మాళిని. ఈవిడ క.. కంటే ఎక్కువ ఏమీ చెప్పట్లేదు.. అసలు నిజమేంటో కైలాష్‌కి ఫోన్ చేసి కనుక్కోవాలి అనుకుంటుంది కాంచన.
ఆ తర్వాత సీన్‌లో మాళవిక యశోదర్‌తో మాట్లాడాలనుకుంటున్నట్లు తన ఫ్రెండ్‌కి చెప్తుంది. పాపం యశ్ నాతో టైం స్పెండ్ చేయాలని ట్రై చేస్తున్నాడు కానీ ఆ సూర్పణక అతన్ని వదలట్లేదు అని వేదని ఉద్దేశించి అసూయపడుతుంది మాళవిక. దాంతో వేదని పక్కకి తీసుకెళ్లడానికి తన ఫ్రెండ్ ట్రై చేస్తుంది. వేద దగ్గరికి వెళ్లి డాక్టర్‌గా నీ సాయం కావాలని అడుగుతుంది. దాంతో యశ్ ఒంటరిగా ఉంటాడు. మాళవిక మాట్లాడే ప్రయత్నం చేస్తుంది కానీ అంతలోనే యశోదర్‌కు ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడుతున్న యశోదర్ దగ్గరికి వెళ్తుంది మాళవిక. మరి భార్యాభర్తలిద్దరి మధ్య ఎలాంటి అలజడి సృష్టిస్తుందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..