Huma Qureshi : ఈమధ్య బాలీవుడ్ లో ఓ ట్రెండ్ నడుస్తుంది. కొత్త మూవీ ఏది రిలీజ్ అయినా.. స్టార్స్ ఫ్యాషన్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే పనిలో పడిపోతున్నారు. వారి వారి సినిమాల ప్రమోషన్లను చేస్తూ అందరి దృష్టిని తమ వైపు తిప్పుకుంటున్నారు. బాలీవుడ్ నటి హుమా ఖురేషి కూడా అదే పనిలో ఉంది. త్వరలో విడుదల కాబోతున్న డబుల్ ఎక్స్ ఎల్ మూవీ కి సంబంధించిన ప్రమోషన్ పనిలో హుమా ఖురేషి మునిగిపోయింది.

Huma Qureshi : మూవీ ప్రమోషన్ కోసం అదిరిపోయే అవుట్ ఫిట్ ను ధరించి హాట్ ఫోజులిచ్చి ఫోటోషూట్ చేసింది. తన ప్రమోషన్ డైరీస్ కు సంబంధించిన పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి ఫ్రెష్ ఫ్యాషన్ గోల్స్ అందిస్తోంది హుమా ఖురేషి.

ఫ్యాషన్ డిజైనర్ హౌస్ సూపర్ డౌన్ కు మ్యూస్ గా వ్యవహరించింది హుమా ఖురేషి. తన ప్రమోషన్ కోసం బ్లాక్ కో ఆర్డ్ సెట్ ను ఈ డిజైనర్ హౌస్ నుంచి ఎన్నుకుంది . ఈ పొట్టి డ్రెస్ లో హుమా స్టన్నింగ్ లుక్స్ తో అదరగొట్టింది. టర్టిల్ నెక్ డీటైల్స్ , ఫుల్ స్లీవ్స్ తో వచ్చిన బ్లాక్ టాప్ వేసుకొని దానికి మ్యాచింగ్ గా నలుపు రంగులో వచ్చిన థై హై వెయిస్టెడ్ పెన్సిల్స్ కట్ స్కర్ట్ ని ధరించింది.

ఈ టైట్ ఫిట్ డ్రెస్ కి తగ్గట్లుగా మెడలో గోల్డ్ పెండెంట్ ఉన్న స్లీక్ గోల్డెన్ చైన్ వేసుకుంది. చేతి వేళ్లకు బంగారు ఉంగరాలను పెట్టుకుంది. ఈ జ్యువెల్లరీని హౌస్ ఆఫ్ మీషో డిజైన్స్ నుంచి సేకరించింది హుమా.

ఫ్యాషన్ స్టైలిస్ట్ సనమ్ రతన్సీ హుమాకు స్టైలిష్ లుక్స్ ని అందించాడు. మేకప్ ఆర్టిస్ట్ అజయ్ విశ్వేశ్వరరావు హుమా అందానికి మెరుగులు దిద్దారు. కనులకు గ్రే ఐ ష్యాడో , బ్లాక్ ఐ లైనర్, మస్కరా, పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకొని గ్లామర్ లుక్కుతో మెస్మరైజ్ చేస్తుంది.
