Vastu Tips: ప్రతి ఒక్కరి జీవితం ధనం అనే చక్రం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే డబ్బు లేనిది ఈరోజుల్లో ఏ పని కాదు అని అందరికీ తెలిసిన విషయమే. కొందరు ఎంత సంపాదించినా వారి జీవితంలో ఏదో ఒక లోటు ఉంటుంది. కొందరు ఎంత కష్టపడినా డబ్బు అంతంత మాత్రంగానే సంపాదిస్తూ ఉంటారు. ఇక మన పూర్వీకుల నుంచి మనం నేర్చుకున్నది ఏమిటంటే ధనం అనేవది లక్ష్మి దేవి స్వరూపం అని. అలా లక్ష్మి దేవి కటాక్షం పొందాలంటే మన పెద్దలు సూచించిన కొన్ని పనులను మాత్రం అసలు చేయకండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ పనులు చేయకుండా ఉంటేనే లక్ష్మి దేవి మీ ఇంటి తలుపు తట్టి మీరు సుఖ సంతోషాలతో ఉండడానికి ఆ తల్లి అనుగ్రహిస్తుంది.
మంచం మీద కుర్చుని తినకండి:
నిజం చెప్పాలంటే ఒకప్పుడు చక్కగా కింద కూర్చుని భోజనం చేసేవారు. కాలాలు మారుతున్న కొద్దీ మనుషుల అభిరుచులు అలవాట్లు కూడా మారిపోయాయి. ఎక్కడ తింటే ఏముంటుందిలే అని అనుకుంటే పొరపాటే. అసలు మంచం మీద కూర్చొని మాత్రం అసలు తినకూడదని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. ఇలా మంచం మీద కూర్చొని తింటే అప్పులు పెరుగుతాయి అని మన పూర్వీకులు తెలిపారు. కాబట్టి ఇప్పటి నుంచైనా మంచం మీద కూర్చొని తినడం మానుకోండి.
వంట గదిలో పాత్రలు ఇలానే ఉంచాలి:
వంట గదిలో పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం మంచిది. మరీ ముఖ్యంగా రాత్రి పూట మాత్రం వంట గదిలో ఎంగిలి పాత్రలను మాత్రం ఉంచకండి. ఇలా చేయడం వల్ల లక్ష్మి దేవి ఇంట్లోకి ప్రవేశించదు. అలాగే చిల్లులు పడిన పాత్రలను మరియు పాడైపోయిన పాత్రలను కూడా ఇంట్లో ఉంచకండి. వంట గది శుభ్రంగా ఉంచితేనే శుభప్రదం.
సూర్యాస్తమయం తర్వాత ఇవి ఇవ్వకండి
సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను బదులుగా ఇవ్వడం కానీ దానంగా ఇవ్వడం కాని అసలు చేయకండి. కానీ కొందరు తెలియక దానాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పెరుగు, పాలు, ఉప్పు, ఊరగాయ ఇవ్వడం వల్ల ఇంటికి అరిష్టం అని వాస్తు శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల సంపద మొత్తం కోల్పోతారని, ఎంత సంపాదించినా ఇంట్లో నిల్వకుండా ఏదో ఒక రూపంలో డబ్బు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది.
Vastu Tips: బాత్రూం ఖాళీ బకెట్లు ఉంచకండి
స్నానపు గదిలో ఖాళీ బకెట్లు ఉంచడం వల్ల కూడా ధన ప్రాప్తి లభించదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ ఖాళీ బకెట్ ఉన్నా కానీ వాటిని బోర్లించి పెట్టాలి. అలా బోర్లించకుండా ఉంచితే మాత్రం ఆర్థికంగా చాలా వెనుకబడి పోతారని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు.