Asthma Problem: ఆస్తమా జబ్బు ఉన్న వ్యక్తులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దీర్ఘకాలం మనికిషి ఊపిరి అందకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరిలోనూ ఈ జబ్బు ఉంటుంది. ఇలాంటి వారు కొన్ని రకాల పదార్థాలను తినకుండా ఉంటే.. వారికి ఊపిరి ఆడకుండా ఉండే సమస్య నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. ఉబ్బసం వ్యాధిని పూర్తిగా తగ్గించలేకపోయినా కనీసం నియంత్రణలో ఉంచుకోవచ్చు.
ఆస్తమా ఉన్న వారిలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. నిద్రలేమి సమస్య వస్తుంది. ప్రమాదకర జబ్బులూ సోకే అవకాశం ఉంటుంది. వీరి కోసం కొన్ని ప్రత్యేక పదార్థాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది యాపిల్. రోజూ ఓ యాపిల్ ను తింటుంటే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. యాపిల్ లో విటమిన్ సి, ఇ ఉంటాయి. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే శక్తి యాపిల్ కు ఉంది. ఆస్తమా రోగులు రోజుకొక యాపిల్ తింటే మంచి ఫలితాలు పొందవచ్చు.
ఊపిరితిత్తుల వ్యాధులను నివారించడంలో దోహదపడే పదార్థాల్లో అల్లం కూడా ఉంది. ఆస్తమా రోగులు తీసుకొనే ఆహారంలో క్రమం తప్పకుండా అల్లం ఉండేలా చూసుకుంటే మంచిది. అలా వీలు కాకపోతే అల్లాన్ని నీటిలో మరిగించి తీసుకుంటే ఆస్తమా తగ్గుతుంది. అలాగే వెల్లుల్లి కూడా ఉబ్బసం రోగులకు దివ్యౌషధం. వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు మేలు చేస్తాయి. చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఓ గ్లాసు నీటిలో కలిపి రోజుకోసారి తీసుకుంటే ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
Asthma Problem:
పసుపు ఆయుర్వేద గుణాలు కలిగి ఉంటుంది. ఆస్తమా రోగులకూ ఇది పరమౌషధం. కర్కుమిన్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సకల రోగాలనూ పారదోలుతాయి. బచ్చలి కూర, తేనె, ఉసిరి కాయ కూడా ఆస్తమా రోగులు తీసుకోవాలి. ఉసిరిలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోజూ పడుకొనే ముందు ఓ టీ స్పూన్ తేనెలో చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలిపి తీసుకుంటే శ్లేష్మాన్ని తొలగిస్తుంది.