Pro Kabaddi 2022: ప్రొ కబడ్డీ లీగ్‌లో దబాంగ్ ఢిల్లీ వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ సాధించింది. యూ పీ యోధాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ 44–42తో గెలిచింది. ఢిల్లీ తరఫున నవీన్ 13 పాయింట్లు, మంజీత్ 12 పాయింట్ల స్కోరు చేశారు. యూపీ తరఫున సురేందర్ గిల్ ఒంటరి పోరాటం చేశాడు. అతడు ఏకంగా 21 పాయింట్లు సాధించాడు.
ప్రో కబడ్డీ 2022 పాయింట్ల పట్టికలో దబాంగ్ ఢిల్లీ ప్రస్తుతం 15 పాయింట్లతో మొదటిస్థానంలో ఉంది. ఇక మూడు మ్యాచ్ లు ఆడిన యూపీ యోధా ఒక మ్యాచ్ లో గెలిచి 7 పాయింట్లతో అయిదవ స్థానంలో ఉంది. పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో బెంగాల్ వారియర్స్ రెండో స్థానం, ఇక హర్యానా స్టీలర్స్ 10 పాయింట్లతో మూడవ స్థానం, బెంగళూరు బుల్స్ నాల్గవ స్థానం, పింక్ పాంథర్స్ 6వ స్థానంలో ఉంది. ఇకపోతే తెలుగు టైటాన్స్ మూడు మ్యాచ్ ల్లో ఒకటి నెగ్గి పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో ఉంది.
నిన్న జరిగిన మరో మ్యాచ్ లో బెంగాల్ వారియర్స్ 42-43తో బెంగళూరు బుల్స్ ను ఓడించింది. బెంగాల్ జట్టులో మనీందర్ సింగ్ (11), బుల్స్ తరపున భరత(8) మెరిశారు. ఇవాళ ఆటకు విశ్రాంతి దినం. మళ్లీ శుక్రవారం పోటీలు జరగనున్నాయి. శుక్రవారం జరిగే మ్యాచుల్లో తమిళ్ తలైవాతో యు ముంబా, హర్యానా స్టీల్ర్స్ తో పింక్ పాంథర్స్, గుజరాత్ జెయింట్స్ తో పుణేరి ఫల్టాన్ తలపడనున్నాయి.
Pro Kabaddi 2022:
తెలుగు టైటాన్స్, యు ముంబా, దబాంగ్ ఢిల్లీ, జైపూర్ పింక్ ఫాంథర్స్, యూపీ యోధాస్, హర్యానా స్టీలర్స్, పూణేరి ఫల్టాన్, తమిళ్ తలైవాస్, గుజరాత్ జెయింట్స్, బెంగాళ్ వారియర్స్, బెంగళూరు బుల్స్, పాట్నా పైరెట్స్ మొత్తం 12 జట్లు ఈసారి టైటిల్ పోరులో ఉన్నాయి.