Vijay Antony: మ్యూజిక్ కంపోజర్‌గా కెరీర్‌ను ఆరంభించి ఆ తరువాత హీరోగా మారిన వ్యక్తి విజయ్ ఆంటోని.హీరోగా కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. దీంతో మ్యూజిక్ కంపోజర్‌గా కంటే నటనపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నాడు. ఎన్నో చిత్రాలతో ముఖ్యంగా ‘బిచ్చగాడు’ సూపర్ హిట్‌తో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. ఈ సినిమా టాలీవుడ్‌లో ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తల్లి సెంటిమెంట్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా కట్టి పడేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన డబ్బింగ్ చిత్రాల్లో ‘బిచ్చగాడు’ ఒకటిగా నిలిచింది.
మరో రెండు, మూడు సినిమాలు సైతం తెలుగులో మంచి సక్సెస్ సాధించడంతో ఆ నాటి నుంచి విజయ్ ఆంటోని తన చిత్రాలను తెలుగులో సైతం విడుదల చేస్తూ వస్తున్నారు. అయితే విజయ్ ఆంటోని ప్రస్తుతం తమ కుటుంబ సమస్యలతో బాధపడుతున్నాడని తెలుస్తోంది. తన భార్య ఫాతిమాతో విభేదాలు వచ్చాయని.. విడాకులు ఇవ్వబోతున్నాడని టాక్ నడుస్తోంది. దీనికి కారణంగా తాజాగా విజయ్ ఆంటోని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టే. నిజానికి విజయ్ ఆంటోని సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తుంటాడు.అలాంటిది ఈ పోస్ట్ పెట్టాడంటే..అతని కుటుంబంలో ఏదో జరుగుతోందని నెటిజన్లు భావిస్తున్నారు. తమ కుటుంబంలో విభేదాలున్నాయనేలా విజయ్ పోస్ట్ పెట్టాడు.తన పోస్టులో కుటుంబ సమస్యలను వెంటనే పరిష్కరించుకునేందుకు యత్నించాలని కోరాడు.
ఒకవేళ సమస్యలను పరిష్కరించుకోవడం వీలు కాదనుకుంటే ఎవరి దారి వాళ్లు చూసుకోవాలని సూచించాడు. ఇక తప్పదు అనుకుంటే మాత్రం కాళ్లు మొక్కేందుకు సైతం వెనుకాడవద్దని.. ఎలాగైనా రాజీకి రావాలని పేర్కొన్నాడు.అంతేకానీ మూడో వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ మీ జీవితాల్లోకి రానీయవద్దని.. ఒకవేళ రానిస్తే మాత్రం వారు మిమ్మల్ని సర్వనాశనం చేసి ఆనంద పడతారని విజయ్ ఆంటోని పేర్కొన్నాడు.తన కుటుంబ సమస్యలతో సతమతమవుతూ విజయ్ ఈ పోస్ట్ పెట్టాడా? లేదంటే కేవలం తన ఆలోచనల్ని మాత్రమే పంచుకున్నాడా? అనేది తెలియరావడం లేదు. మొత్తానికైతే విజయ్ పోస్ట్‌తో నెట్టింట పెద్ద చర్చే నడుస్తోంది.విజయ్ ఆంటోనికి అతని భార్యకు మధ్య వచ్చిన వ్యక్తి ఎవరంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.