దీప, మోనిత, కార్తీక్, సౌర్య ఒకరికి తెలియకుండా ఒకరు బతుకమ్మ పండుగ కోసం సంగారెడ్డి వెళతారు. దీపని అవమానించడానికి కావేరితో కలిసి చాలా ప్రయత్నాలు చేస్తుంది మోనిత. అవన్నీ తనకే ఎదురు తిరుగుతాయి. సౌర్య తల్లిదండ్రులు అక్కడ ఉన్నారేమోనని వెతుకుతుంది. అది గమనించిన మోనిత ప్రతిసారి అడ్డు పడుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 12న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
బతుకమ్మ ఆడిన తర్వాత మహిళలు అందరు కలిసి నిమజ్జనం చేయడానికి చెరువు దగ్గరకి వెళతారు. అక్కడికి వెళ్లిన తర్వాత డాక్టర్ అన్నయ్య తల్లి సూచన మేరకు.. కార్తీక్‌ని తనకి దక్కేలా చేయమని కోరుకుంటుంది దీప. అనంతరం నీటిలో బతుకమ్మని వదిలి పెడుతుంది. తర్వాత కార్తీక్ ఎక్కడ ఉన్నాడని కంగారు పడుతుంటే.. ఏం కాదని ఓదార్చుతుంది పెద్దావిడ. ఇంకో వైపు.. దీపని చంపడానికి రౌడీలను మాట్లాడుతుంది మోనిత. ఆ రాత్రి గడిచేలోపే చంపేయాలని వారికి చెబుతుంది. దీపని చంపి దాన్ని తను క్రియేట్ చేసిన భర్త మీదకి తోసేయాలని ఫిక్స్ అవుతుంది. అనంతరం దీప ఓ వైపు, మోనిత మరో వైపు కార్తీక్‌కి వెతుకుతుంటారు. అయినా కార్తీక్ ఎవ్వరికీ ఎక్కడా కనిపించడు. ఇంతలో.. వెతుకుతూ వచ్చిన ఇంద్రుడికి దీప కనిపిస్తుంది. తన కూతురు దీపని చూడాలనుకుంటుందని చెబుతాడు ఇంద్రుడు. అయినా దీప కంగారులో వినకపోవడంతో సౌర్య కథ గురించి చెబుతాడు ఇంద్రుడు. కానీ అంతకుముందే అక్కడి నుంచి వెళ్లిపోతుంది దీప. అదంతా సౌర్యకి చెప్పడంతో మా అమ్మ అలా చేయదని చెప్పి ఇంటికి వెళ్లిపోదామని చెబుతుంది సౌర్య.
కార్తీక్ కనిపించకపోవడంతో కంగారు పడుతుంటుంది మోనిత. గతం గుర్తొచ్చిదేమోనని కావేరితో అంటుంది. దానికి అదే జరిగితే కోపంతో వచ్చి నీ గొంతు పట్టుకునేవాడు కదా అని అనడంతో కూల్ అవుతుంది మోనిత. ఇంతలో ఏదో ఆలోచిస్తూ అయోమయంలో ఉన్న కార్తీక్ దగ్గరకి రాజ్యలక్ష్మి. దాంతో.. మోనిత, తనకి ఈ ఊరితో సంబంధం లేదా.. దీపకి నాకు సంబంధం లేదా అని అడుగుతాడు కార్తీక్. దానికి మోనిత మోసం చేస్తుందని చెబుతుంది రాజ్యలక్ష్మి. అంతేకాకుండా.. ఎవరినీ నమ్మాలో తెలియని అయోమయంలో ఉన్న కార్తీక్‌ని దీపనే నమ్ము అని చెబుతుంది. అదే ఆలోచిస్తున్న కార్తీక్ దగ్గరకి వారణాసి వస్తాడు. డాక్టర్ బాబు నువ్వు బతికే ఉన్నావా అని అడుగుతాడు వారణాసి. తనకి గతం గుర్తు లేదని ఎవరి మాటలు విని మోసపోదలచుకోలేదని కోపంగా అంటాడు కార్తీక్. దాంతో.. కార్తీక్, దీప కలిసి తీసుకున్న ఫొటోని చూపించి ఇప్పటికైనా నమ్ముతారా అని అడుగుతాడు. ఇంకోవైపు.. మోనిత కోపంగా తిట్టిన మోనిత గురించే ఆలోచిస్తుంటుంది సౌర్య. అదే విషయం ఇంద్రుడికి చెబుతుంది. దాంతో.. తను కావాలనే అలా చేస్తుందని, దానికి కారణం సౌర్య అమ్మనాన్న బతికి ఉండడం నిజమేనని గట్టిగా అంటాడు ఇంద్రుడు. అందుకే ఓ సారి ఆటో వచ్చిన ఆమెని చూస్తే అమ్మ కాదా అని నిజం తెలిసిపోతుందని అంటాడు ఇంద్రుడు. కానీ.. అమ్మ అలా కసరదంటూ వద్దంటుంది సౌర్య. దాంతో చంద్రమ్మ కోసం వెతుక్కుంటూ వెళతారు ఇద్దరు.
మరో వైపు.. మోనిత రౌడీలు అక్కడికి వచ్చి ఆమెకి ఫోన్ విధి చివరిలో ఉన్నామని చెబుతారు. దాంతో.. కార్తీక్‌ని వెతుకుతూ అటుగా వచ్చిన దీపని.. కార్తీక్ విధి చివరికి నడుచుకుంటూ వెళ్లడని అబద్ధం చెబుతుంది మోనిత. దాంతో.. అతన్ని వెతుకుతూ అటు వైపు వెళుతుంది దీప. అది చూసి ఈ రోజు దీప పీడ విరగడైందని సంతోష పడుతుంది మోనిత. దాంతో.. ఈ ఎపిసోడ్‌కి శుభం కార్డు పడుతుంది. తరువాయి భాగంలో.. వారణాసి కింద పడిపోయి ఉంటాడు. అతన్ని లేపుతూ.. దీప, పిల్లలు ఎక్కడా అని అడుగుతుంటాడు కార్తీక్. అయినా వారణాసి లేవకపోవడంతో ఏదో గుర్తొచ్చినట్లు దీప అని గట్టిగా అరుస్తాడు. ఆ మాటలు అటుగా వెళుతున్న దీపకి వినిపిస్తాయి. అసలేం జరిగిందో నెక్ట్స్ ఎపిసోడ్‌లో చూడండి.