Karishma Kapoor : ఏజ్ పెరుగుతున్నా కొద్దీ అలనాటి అందాల బాలీవుడ్ భామలు ఎక్స్ పోజింగ్ డోస్ పెంచుతూ హీట్ పెంచుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అప్డేటెడ్ ఫ్యాషన్ ను ఫాలో అవుతూ మెస్మరైజ్ చేస్తున్నారు. 48 ఏళ్ల వయసులోనూ నాజూకు ఫిగర్ ను మెయిన్ టైన్ చేస్తూ సోషల్ మీడియాలో చెలరేగిపోతోంది అప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్.

Karishma Kapoor : ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కరిష్మా కపూర్ చురుగ్గా ఉంటోంది తనకు సంబంధించిన విషయాలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటోంది. లేటెస్ట్ గా క్రాప్ టాప్ డెనిమ్ జీన్స్ తో చేసిన ఫోటోషూట్ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది కరిష్మా. ఈ పిక్స్ నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి. కరిష్మా లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

డెనిమ్స్ అవుట్ ఫిట్ లో క్లాసీ స్టైల్స్ తో ఎలా అదరగొట్టాలో కరిష్మా కపూర్ కు బాగా తెలుసు. గత కొన్ని దశాబ్దాలుగా అద్భుతమైన ఫ్యాషన్ స్టైల్స్ తో అభిమానులను అలరిస్తోంది కరిష్మా. వయసు పెరిగినా కొద్దీ ఈమె అందం కూడా మరింతగా పెరుగుతోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్స్ ను ఫాలో అవుతూ ఫ్యాషన్ ప్రియులకు స్టేట్మెంట్స్ ఇస్తోంది.

తాజాగా చేసిన ఫోటోషూట్ కోసం వైట్ క్రాప్ టాప్ వేసుకొని డార్క్ బ్లూ డెనిమ్స్ ధరించి అదరగొట్టింది. కనులకు షిమ్మరింగ్ ఐ లిడ్స్, పెదాలకు పింక్ లిప్ కలర్ వేసుకుని, రోసీ మేకప్ తో క్రేజీగా కనిపించింది.

క్యాజువల్ అవుట్ ఫిట్స్ లోనూ అద్భుతంగా కనిపిస్తుంది కరిష్మా. ప్లెయిన్ వైట్ ట్యాంక్ టాప్ వేసుకొని దానికి జోడిగా రిపేడ్ బ్లూ డెనిమ్స్ ధరించింది. ముంబై సీ షోర్ లో దిగిన ఈ పిక్ లోనో స్టైలిష్ గా కనిపించింది.

ఈ మధ్యనే చేసిన ఓ ఫోటోషూట్ కోసం కరిష్మా ఫ్యాషన్ డిజైనర్లు గౌరీ , నైనిక లకు మ్యూస్ గా వ్యవహరించింది. ఆఫ్ షోల్డర్ బ్లాక్ కలర్ గౌన్ వేసుకుని హాట్ లుక్స్ తో మెస్మరైజ్ చేసింది

