Bigg boss 6 : కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్.. మిగిలిన వాళ్లకేమో కానీ యూట్యూబర్ ఆదిరెడ్డికి మాత్రం మాంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. మనోడు చాలా ఇంటెలిజెంట్‌గా తన భార్య, కూతురితో వీడియో కాల్ మాట్లాడాలని చెప్పాడు. అదిరిపోయే డెసిషన్ ఇది. ఇంటి నుంచి దూరంగా ఉన్నాడు. పైగా ఒక చిన్నారి పాప.. ఆ పాపను చూసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి? మంచి సింపథి వర్కవుట్ అయ్యే సీన్‌తో పాటు అతని భార్య కవిత చెప్పిన మాటలు తలకెక్కితే మాత్రం టాప్ 5లో ప్లేస్ గ్యారెంటీ.
కవిత చాలా ఇంటెలిజెంట్‌గా ఆదిరెడ్డికి హింట్ ఇచ్చింది.నిజానికి ఆదిరెడ్డి బిగ్‌బాస్ రివ్యూలతోనే పైకి వచ్చాడు. అలాంటప్పుడు ఎవరైనా ఎమైనా చెబితే.. ఎందుకు చెప్పారు? దాని వెనుక ఉన్న నిగూఢ అర్ధమేంటనేది ఆలోచించగల కెపాసిటీ ఉంది. అందుకే కవిత చెప్పిన ప్రతి మాటను తను అనాలసిస్ చేసుకోగలడు.కవిత చాలా మెచ్యూరిటీతో మాట్లాడింది. మరి ముఖ్యంగా కవిత.. ‘నీ వైపు తప్పులేనప్పుడు.. అవతల వ్యక్తి ఎవరైనా సరే ఆర్గ్యుమెంట్ చేయి.. అస్సలు వదలొద్దు’ అని చెప్పింది. విన్నర్‌గా తిరిగి రావాలంటూ అతనిలో కొండంత ఆత్మ విశ్వాసాన్ని నింపింది.
అయితే గీతూకి దూరంగా ఉండమని ఆదిరెడ్డికి కవిత చెప్పకనే చెప్పేసింది. దూరంగా ఉండమని.. అంటే పూర్తిగా అని కాదు.. కానీ ఆమె తప్పు చేసినా ఒప్పు చేసినా ఆమె వైపే నిలబడకుండా అవతల ఉన్నది ఫ్రెండ్ అయినా ఎవరైనా స్టాండ్ తీసుకోవాల్సినపుడు తప్పకుండా ఆ ఫ్రెండ్‌కి ఎగెనెస్ట్‌గా వెళ్లైనా సరే స్టాండ్ తీసుకో. నీవైపు తప్పు లేనప్పుడు అవతల ఎవరున్నా కడిగి పారేయమని చెప్పింది.వీకెండ్ టాస్క్‌లో ఆదిరెడ్డి.. గీతూని కాదని.. బాలాదిత్యకు సపోర్ట్‌గా నిలిచాడు.ఇది జనాల్లోకి మంచి పాజిటివ్ సెన్స్‌తో వెళ్లి ఉంటుంది. కాబట్టి దీని గురించే కవిత తనకు అంతలా చెప్పి ఉంటుందని గ్రహించగలడు. ఎన్ని రివ్యూలు చేశాడు.. మనోడికి ఆమాత్రం వెలగదా? వెలగకుంటే ఏం చెయ్యలేమనుకోండి.