Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు ఆరో వారం ఆసక్తికరంగా సాగుతోంది. దీనిలో భాగంగా కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో భాగంగా బ్యాటరీ రీ చార్జ్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్.దీనిలో భాగంగా కొంత ఎమోషన్.. కొంత హ్యాపీ. కొందరికి ఈ టాస్క్ చాలా బూస్ట్ ఇచ్చింది. వారిలో సుదీప, ఆదిరెడ్డి ఉన్నారు. ఇక నేటి ప్రోమోను బట్టి అర్జున్‌కు తన తండ్రి నుంచి వీడియో కాల్ వచ్చింది. అతను కూడా ఫుల్ హ్యాపీ. బాలాదిత్యకు మాత్రం ఈ టాస్క్ కొంత ఇబ్బందికరంగానే తయారైంది.
అయితే ఈ టాస్క్‌లో భాగంగా గీతూ చేసిన పనికి బాలాదిత్య ఫైర్ అయ్యాడు. అసలేం జరిగిందంటే..బాలాదిత్య అన్ని విషయాల్లోనూ సూపర్ కానీ స్మోకింగ్ అలవాటు ఉంది. ఈ అలవాటు కారణంగా తనని బ్యాడ్ అని అనలేం కానీ అదే అతనికి కొంచెం ఇబ్బంది తెచ్చి పెట్టింది. బాలాదిత్య.. చలాకీ చంటి ఉన్నన్ని రోజులు అతనితో కలిసి స్మోక్ చేసేవాడు. ఆ తరువాత సింగిల్‌గా కూర్చొని స్మోక్ చేస్తూ కనిపించేవాడు. ఈ అలవాటు మీదే బిగ్‌బాస్ దెబ్బ కొట్టాడు.
బ్యాటరీ రీచార్జ్ టాస్క్‌లో భాగంగా బ్యాటరీ రీచార్జ్ కావాలంటే హౌస్ మొత్తం ఫుడ్ అయినా మానేయాలి.. లేదంటే బాలాదిత్య స్మోకింగ్ అయినా మానేయాలనూ రూల్ పెట్టాడు బిగ్‌బాస్. దీనిని గీతూ వచ్చి అందరి ముందు అరుస్తూ చెప్పేసింది. దీంతో బాలాదిత్య బాగా హర్ట్ అయ్యాడు. ఏదైనా తనకు వచ్చి స్ట్రెయిట్‌గా చెప్పొచ్చు కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే బాలాదిత్య స్మోక్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యతను కెప్టెన్ రేవంత్‌కు అప్పగించాడు. మొత్తానికి ఈ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ అన్నా చెల్లెళ్లూ.. బాలాదిత్య, గీతూల మధ్య దూరాన్ని మరింత పెంచేలాగే కనిపిస్తోంది.
.