Manjula Paritala: తెలుగు బుల్లితెర నటుడు నిరుపమ్ పరిటాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు బుల్లితెర పై ఎన్నో సీరియల్స్ లో నటించి నటుడిగా మంచి గుర్తింపును ఏర్పరుచుకున్నాడు నిరుపమ్. అయితే చాలామంది నిరుపమ్ అనగానే గుర్తు పెట్టకపోవచ్చు కానీ కార్తీక్ అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు.
బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించినప్పటికీ కార్తీకదీపం సీరియల్ ద్వారా విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు నిరుపమ్. కార్తీకదీపం సీరియల్ డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ క్యారెక్టర్ లో నటించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత చేరువయ్యాడు.
ఇకపోతే నిరుపమ్ బుల్లితెర నటి మంజులను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మంజుల కూడా పెళ్లికీ ముందు కూడా పలు సీరియల్స్ లో నటించి నటిగా మంచి గుర్తింపు ఏర్పరచుకుంది. పెళ్లి అయిన తర్వాత కూడా మంజుల ఇప్పటికి సినిమాలలో నటిస్తూనే వుంది.
ఇకపోతే వీరు చంద్రముఖి సీరియల్ సమయంలో ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకొని ఆ తర్వాత కొన్నాళ్లకి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట ఒక యూట్యూబ్ ఛానల్ ని మొదలుపెట్టి ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు రకాల వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉన్నాను.
వారి వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలను అలాగే షాపింగ్ చేసినప్పుడు ఫెస్టివల్ సమయంలో ఇలా ప్రతి ఒక్క వీడియోని అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఈ జంట యానివర్సరీ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు.
సందర్భంగా ఈ జంట రింగులను ఎక్స్చేంజ్ చేసుకోవడంతో అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను వారి ఇంస్టాగ్రామ్ లో పంచుకుంటూ మళ్లీ ఎంగేజ్మెంట్ చేసుకున్నంత హ్యాపీగా ఉంది అంటూ క్యాప్షన్ ను కూడా రాసుకొచ్చారు.