సిటీమార్ తో సూపర్ హిట్ సొంతం చేసుకొని మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన టాలెంటెడ్ కమర్షియల్ డైరెక్టర్ సంపత్ నంది ప్రస్తుతం తన కొత్త సినిమా కోసం హీరోని సెట్ చేసుకునే పనిలో పడ్డాడు. రవితేజతో సంపత్ నంది సినిమా కన్ఫర్మ్ అయ్యిందనే టాక్ వినిపించింది. అయితే మళ్ళీ దానిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక గోపిచంద్ మరో సారి సంపత్ కి అవకాశం ఇక్కడని కూడా ప్రచారం జరిగింది. అయితే గోపీచంద్ నెక్స్ట్ శ్రీనువైట్ల, శ్రీవాస్ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు. ఈ రెండు సినిమాల తర్వాతనే నెక్స్ట్ సినిమా ఉండే అవకాశం ఉంది.
ఈ నేపధ్యంలో సంపత్ నంది ఇప్పుడు కళ్యాణ్ రామ్ కి రీసెంట్ గా కథ చెప్పి ఒప్పించినట్లు టాక్ వినిపిస్తుంది. ఇక కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. తరువాత డెవిల్ అనే పాన్ ఇండియా మూవీ ఉంది. దీని తర్వాత సంపత్ నంది చెప్పిన కథతో సినిమా చేద్దామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ మూవీని పాన్ ఇండియా లెవల్ లోనే ప్లాన్ చేయనున్నట్లు టాక్.
అయితే సంపత్ తో కళ్యాణ్ రామ్ సినిమా స్టార్ట్ చేయడానికి మరో ఏడాదికి పైగానే సమయం పడుతుంది. అయితే ఈ లోపు తన దగ్గర ఉన్న చిన్న కథలతో నిర్మాతగా లో బడ్జెట్ సినిమాని ఒక హీరోతో ప్లాన్ చేయాలని సంపత్ భావిస్తున్నారు. లేదంటే వెబ్ సిరీస్ అయినా తెరకెక్కించాలని అనుకుంటున్నాడు. కళ్యాణ్ రామ్ ఫ్రీ అయ్యే సరికి వీటిలో ఏదో ఒకటి పూర్తవుతుందని ఆలోచించి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం దర్శకుడిగా రెస్ట్ ఇచ్చి నిర్మాతగా ప్రేక్షకుల ముందుకి రావాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.