Vastu Tips: హిందూ దేవుళ్లు ఎంత మంది ఉన్నా హనుమంతుడిని బలంగా నమ్మే వారు ఎక్కువగా ఉంటారు. అన్ని భయాల నుండి కాపాడే దేవుడిగా, ధైర్యానికి ప్రతీకగా కొలిచే ఆంజనేయుడి ఫోటోని ఇంట్లో పెట్టుకుంటే మంచిది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే చాలామందికి హనుమంతుడి చిత్రపటాన్ని ఎక్కడ ఉంచాలనే డైలమాలో ఉంటారు. వాస్తు ప్రకారం హనుమంతుడి ఫోటో దక్షిణ దిశలో ఉంటే ఇంటికి మంచి జరుగుతుంది.
ఇక ఇంట్లో కూర్చొని ఉన్న హనుమంతుని ఫోటో అది కూడా ఎరుపు రంగులో ఉంచుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించవు. హనుమంతుని ఫోటో విషయంలో వాస్తులో ప్రత్యేకంగా చెప్పబడిన అంశం ఏంటంటే.. ఈ ఫోటోని ఎట్టి పరిస్థితుల్లోనూ బెడ్ రూంలో ఉంచకూడదు అని వివరించబడింది. ఎందుకంటే హనుమంతుడు బాల బ్రహ్మచారి. అందువల్ల, పడకగదిలో వారి చిత్రాన్ని ఉంచడం అశుభకరంగా పరిగణించబడుతుంది.
ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉంది లేదంటే ప్రతికూల శక్తులు ఉన్నట్లు మీరు భావిస్తే బలాన్ని లేదా శక్తిని చూపించే ముద్రలో ఉన్న హనుమంతుని ఫోటోని లేదంటే పంచముఖి హనుమాన్ ఫోటోని ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉ:చాలి. దీని వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయి ఇంట్లో అంతా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇది పురోగతికి మార్గం కూడా తెరుస్తుందని నమ్ముతారు.
Vastu Tips:
ఇక మొదలు పెట్టిన ప్రతి పని విజయవంతం కావాలంటే ఎగిరే భంగిమలో ఉన్న హనుమంతుని ఫోటోని లేదంటే బొమ్మని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మంచి కలుగుతుందని వాస్తు చెబుతోంది. ఇంట్లో శ్రీరాముని ఫోటో ఉంటే అక్కడ హనుమంతుని ఫోటో కూడా ఉంచితే మంచి జరుగుతుందట.