Marriage Life: కష్టాలు సుఖాలు సంతోషాలు అన్నీ కలిస్తేనే జీవితం అంటారు మన పెద్దలు. ఈ జీవితం అనేది మనకు మన తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తుంది.పెళ్ళైన దంపతులు ఇద్దరు ఆహ్లాదకరమైన జీవితాన్నిసరదాగా గడపాలని కోరుకుంటారు. కానీ ప్రతి ఒక్కరూ కోరుకున్నట్లుగా బంధం ఉండకపోవచ్చు. వాళ్లు అనుకున్నట్టు కొంతమంది సంతోషంగానూ ఇంకొంతమంది ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు. ఈ సజీవ జీవనంలో తల్లిదండ్రుల మధ్య ,భార్య భర్తల మధ్య ,అక్క చెల్లెళ్ళ మధ్య, అన్నదమ్ముల మధ్య గొడవలు, మనస్పర్థలు రావడం చాలా సహజం. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు సహజం, కాని తరుచూ వస్తే అవి ఎంత స్థాయిలో ప్రభావం చూపుతుందనే విషయాన్ని భార్యాభర్తలిద్దరూ తీసుకోవాలంటున్నారు నిపుణులు.
దంపతులు ప్రతి చిన్న విషయానికీ ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం మామూలు విషయమే కాని కోపంలో టెంపర్ కోల్పోయి ఉపయోగించే పదాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కొందరైతే ఏకంగా తమ జీవిత భాగస్వామిని బూతులు తిడుతూ ఉంటారు. ఆ తిట్లు ఇద్దరిని బాధపెట్టడం తో పాటు తీవ్ర ఒత్తిడి కి గురైతే బంధం సరిగా లేదనే అర్థం.
ఎక్కవ కాలం కలిసి ఉన్న దంపతులకు వారి పార్ట్ నర్ ఏ సమయంలో ఎలా ఉంటారు అనే విషయంలో ఓ అవగాహన ఉంటుంది. కానీ… మీ ఊహకు అందకుండా.. కనీసం ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో కూడా మీరు ఊహించలేకపోతున్నారు అంటే…. మీ బంధం సరిగా లేదనే అర్థం.
ప్రతి విషయంలోనూ మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని బెదిరిస్తున్నా, కంట్రోల్ చేస్తున్నారంటే కూడా అర్థం చేసుకోవాలి. అంటే మీరు తినే తిండి వేసుకునే బట్టలు ఇలా ప్రతి విషయంలోనూ వారికి నచ్చినట్లుగానే ఉండాలని, నా మాట వినకపోతే. నిన్ను వదిలేస్తాను.. దిక్కులేకుండా పోతావ్ ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారంటే మీ బంధం సరిగా లేదనే అర్థం. అలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిది.
Marriage Life:
మీ జీవితభాగస్వామి ఇంట్లో ఆర్థికపరంగా అన్ని విషయాలను తానే చక్కపెడుతూ… ఆ పొగరుని మీ మీద చూపిస్తున్నా, తామే సంపాదిస్తున్నామనే పొగరుతో మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నా, అందరి ముందు.. మీ పై జోకులు వేయడం, మిమల్ని తక్కువ చేయడం లాంటివి చేస్తున్నా, ఆ బంధం సరిగా లేదనే అర్థం. ఇలాంటి బంధానికి దూరంగా ఉండటమే మంచిదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.