unstoppable 2 : నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వచ్చిన ‘అన్‌స్టాపబుల్’అనే షో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరల్డ్స్ బిగ్గెస్ట్ షోలలో ఒకటిగా నిలిచింది. ఇక అన్‌స్టాపబుల్ 2 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ షోకి తొలి గెస్ట్‌గా టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చారు.ఏదైనా స్టార్ వస్తే మంచి మజా వస్తుంది కదా అనుకున్నారు అంతా. కానీ అంతకు మించిన మజా వచ్చింది.ఈ షోలో మీ జీవితంలో అతి పెద్ద నిర్ణయమేది అని బాలయ్య అడిగినప్పుడు.. 1995 నాటి పరిణామాలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
తాజాగా ఈ టాక్ షోకి సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. తన జీవితంలో అతి పెద్ద నిర్ణయం గురించి చంద్రబాబు మాట్లాడుతూ.. తన మాట వినమని ఎన్టీఆర్‌ను కాళ్లు పట్టుకుని అడుక్కున్నానని తెలిపారు.కానీ ఆయన వినలేదని ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.తన ఆరాధ్య దైవం ఎన్టీఆరేనని ఆయన ఎప్పటికీ తన గుండెల్లో ఉంటారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు బాలకృష్ణను కూడా ఒక ప్రశ్న వేశారు.‘ఒక వ్యక్తిగా అడుగుతున్నాను. మనం తీసుకున్న నిర్ణయం తప్పా’అని ఆయన అడిగారు.
చంద్రబాబు అడిగిన ప్రశ్నకు బాలయ్య సమాధానం ఏంటనేది చూపించలేదు కానీ నాడు ఏం జరిగిందనేది తనకు ఇంకా గుర్తుందని మాత్రం చెప్పుకొచ్చారు. 1995లో తెలుగుదేశం పార్టీలో అంతర్గత సంక్షోభంలో ముఖ్యమంత్రి పదవి నుంచి ఎన్టీఆర్ దిగిపోయి చంద్రబాబు గద్దెనెక్కిన విషయం తెలిసిందే.నిజానికి షోలో మాత్రం ఆ రోజు ఏం జరిగిందో చంద్రబాబు వివరించినట్టు మాత్రం తెలుస్తోంది.బాలయ్య కూడా తమ కుటుంబంలో అసలు ఆ రోజు ఏం జరిగిందో వెల్లడించారు.ఈ నెల 14వ తేదీన ఈ టాక్ షో ప్రసారం కానుంది.