Alovera Juice: మనకు అందుబాటులో ఉంటూ ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్క అలోవెరా (కలబంద). ఇది పోషక ప్రయోజనాలు, ఆయుర్వేద సారాన్ని కలిగి ఉంటుంది. జ్యూస్, కలబంద రసం ఆయుర్వేద స్టోర్స్, ఆహార దుకాణాల్లో లభిస్తుంది. కలబందతో పొందే ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాల గురించి క్లుప్తంగా…
ప్రయోజనాలు:
1. మలబద్ధకంతో బాధపడుతున్నవారికి ఒక వరంలా కలబంద రసం పనిచేస్తుంది. 2. సాధారణ కలబంద రసం 9.1 గ్రా. విటమిన్ సి మూలం కలిగి ఉంటుంది. ఇది సహజ యాంటీఆక్సిడెంట్ మరియు వాపు సమస్యలతో పోరాడి రోగనిరోధక శక్తి పెంచుతుంది. 3 ఒక గ్లాస్ కలబంద రసంలో కేవలం 36 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇది తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.. 4.అలోవెరా జ్యూస్ తో మౌత్ వాష్ చేసుకోవడం ద్వారా చిగుళ్ల వాపు నుండి విముక్తి పొందవచ్చని ఇటీవల ఒక సర్వే పేర్కొంది. 5. షుగర్ ఉన్నవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుందని జర్నల్ ఆఫ్ క్లినికల్ ఫార్మసీ అండ్ థెరప్యూటిక్స్ ట్రస్టెడ్ సోర్స్ చేసిన పరిశోధనలో తెలిసింది. 6. కడుపులో పూత, జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్న వారికి కలబంద దివ్యౌషధం, జీర్ణ ప్రయోజనాలను కలిగిస్తుందని 2014 నుండి జరిపిన ఒక పరిశోధన తేల్చింది.
దుష్ప్రభావాలు:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ట్రస్టెడ్ సోర్స్ (NIH) జరిపిన ఒక అధ్యయనంలో కలబంద ఆకు సారాన్ని తీసుకోవడం వల్ల మగ మరియు ఆడ ఎలుకలలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని గుర్తించారు. కలబంద రసం తాగడం వల్ల కడుపు నొప్పి మరియు ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కూడా ఏర్పడవచ్చు. అలోవెరా జ్యూస్ను మితంగా తాగడం చాలా మంచిది. కడుపు నొప్పి లేదా ఇతర లక్షణాలను ఉంటే ఈ రసం తాగడం మానేయాలి.
Alovera Juice:
మన ప్రాచీన ఆయువేద విజ్ఞులు కూడా కలబండను వివిధ రకాలుగా విరివిగా ఉపయోగించే వారు. అయితే ఈ కలబంద ను మొదటి సారిగా ఉపయోగించాలని అనుకుంటున్న వారు, తగిన జాగ్రత్తలు పాటించాలి. ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ అనిపిస్తే నిపుణులను సంప్రదించి ఎలా వాడాలో, ఎప్పుడు వాడాలో తెలుసుకొని మంచి ప్రయోజనాలు పొందడమే కాక, దుష్ప్రయోజనాలను ఎదుర్కోవచ్చు.