ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ నెక్స్ట్ సినిమా విషయంలో చాలా గ్యాప్ వచ్చింది. దీనికి కారణం కొరటాల శివతో సినిమాకి కమిట్ కావడమే అనే విషయం అందరికి తెలిసిందే. కళ్యాణ్ రామ్ నిర్మాణంలోనే ఈ సినిమా తెరకెక్కబోతుంది. అయితే కొరటాల శివకి ఆచార్య ఫ్లాప్ తో తారక్ తో చేయబోయే కథపై మళ్ళీ రీవర్క్ చేసినట్లు తెలుస్తుంది. యూనివర్సల్ అప్పీల్ కోసం కథని మార్పులు చేశారు. అయితే కథ విషయంలో తారక్ పూర్తిగా సంతృప్తి చెందే వరకు కొరటాల వర్క్ చేయడానికి అంగీకరించాడని టాక్. ఈ కారణంగానే ఈ మూవీ మరింత ఆలస్యం అవుతుంది.
ఇక ఈ సినిమా నిర్మాణం భాగస్వామి అయిన యువసుధ ఇప్పటికే మూవీ ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. అయితే ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా మరోసారి ఈ కాంబినేషన్ మూవీపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ మూవీలో తారక్ కి జోడీగా రష్మిక మందనని హీరోయిన్ గా ఖరారు చేసినట్లు టాక్. అలాగే కీర్తి సురేష్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తుంది.
ఇక ఈ మూవీకి సంబందించిన అప్డేట్ త్వరలో వస్తుందని, నవంబర్ 12 నుంచి సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందనే మాట ప్రచారంలో ఉంది. అయితే ఈ విషయంపై నిర్మాతల నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. మరో వైపు కొరటాల ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ పక్కన పెట్టి బుచ్చిబాబు మూవీని ముందుకి తీసుకొచ్చినట్లు కూడా టాక్ నడుస్తుంది. అయితే వీటిలో ఏది వాస్తవం అనేది మాత్రం తెలియడం లేదు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఏదో ఒక అప్డేట్ తారక్ సినిమా గురించి వస్తే వినాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి దీనిపై ఎప్పటికి స్పష్టత వస్తుందనేది చూడాలి.