మాళిని చేసిన డ్యాన్స్‌తో స్పృహలోకి వస్తుంది సులోచన. డాక్టర్ వచ్చి నిజంగా ఇది మిరాకిల్ అంటూ పొగడుతుంది. మరోవైపు యశోదర్ తన మామయ్యకు సహాయం చేస్తాడు. అత్తయ్యకు ఆస్పత్రిలో అవుతున్న ఖర్చును తనే భరిస్తాడు. దాంతో వరదరాజులు సంబరపడిపోతాడు. ఆ తర్వాత అక్టోబర్ 11 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఒంటరిగా కూర్చున్న యశోదర్‌ని పలకరిస్తుంది వేద. ప్రేమగా భర్తకు టిఫిన్ బాక్స్ ఇచ్చి తినమంటుంది. అంతే ప్రేమతో భార్యని కూడా తినమంటాడు యశ్. ‘అత్యయ్య అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలిశాక ప్రశాంతంగా ఉంది. ఈ హాస్పిటల్ జీవితం విచిత్రంగా ఉంటుంది’ అంటూ హాస్పిటల్ గురించి క్లుప్తంగా వివరిస్తాడు భార్యకు. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ ఒక రాత్రంతా హాస్పిటల్‌లో గడుపుతున్నానంటాడు. ఇంతకీ ఎపుడు వచ్చారని వేద అడగ్గా.. నా ఆది పుట్టినపుడు వచ్చానని గతానంతా వివరిస్తాడు ఎమోషనల్ అవుతూ. ఆదిత్య పుట్టిన క్షణాన్ని తలుచుకుంటూ సంబరపడిపోతారు వేద, యశ్‌లు. ఆ స్పర్శ ఎప్పటికీ మరిచిపోలేనిదని అంటాడు యశోదర్. ఆదిత్య అంటే నాకు ఇప్పటికీ ఎప్పటీకి ప్రేమే అంటాడు. వేద యశోదర్‌కు ‘థ్యాంక్స్’ చెప్తుంది. ఒక కండీషన్ మీద ఈ థ్యాంక్స్‌ని ఆక్సెప్ట్ చేస్తానంటాడు యశ్. ఏంటదని వేద అడగ్గా.. నువ్ నాకు క్లాస్‌లు పీకడం మానేయాలని కోరుతాడు యశ్. సరేనంటూ నవ్వుతుంది వేద. అమ్మని టైంకు అడ్మిట్ చేసి ప్రాణాలు కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అంటుంది వేద మళ్లీ. ఇందులో నాదేం లేదు. అత్తయ్య గారి మంచితనం తను చేసిన పూజలే తనని కాపాడాయని అంటాడు యశ్. అందుకే హాస్పిటల్ బిల్ కూడా కట్టారా అని అడగ్గా.. బిల్ ఫ్రీగా కట్టలేదు. అప్పుగా ఇచ్చాను. వడ్డీ కూడా వసూలు చేస్తానంటాడు సరదాగా. తనపై కండీషన్లు పెట్టకూడదని అదను చూసి యశోదర్. అలా భార్యాభర్తలిద్దరూ కాసేపు సరదాగా గడుపుతారు. అలాగే అక్కడే వేద భర్త భుజాలపై తలవాల్చి నిద్రపోతుంది.
మరుసటి రోజు ఉదయం సులోచన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్తుంది. గ్రాండ్‌గా వెల్‌కం చెప్తారు మాళినితో సహా ఇంట్లోని వారంతా. వియ్యపురాలుకు స్వయంగా దిష్టి తీస్తుంది మాళిని. సులోచనతో కాసేపు సరదాగా పోట్లాడుతుంది. సులోచన వదినని నేనే చూసుకుంటానని మాటిస్తుంది మాళిని. వారం రోజుల్లో మా వదిన లేచి టపీ మంటూ నడుస్తుందని హామీ ఇస్తుంది. ఆ తర్వాత సులోచనని ఇంట్లోకి తీసుకెళ్లి డాక్టర్ జాగ్రత్తలన్నీ చెప్తుంది. పేషెంట్‌ని గాజుబొమ్మలా చూసుకోవాలని, ఎక్కువగా డిస్ట్రబ్ చేయకూడదని అంటుంది డాక్టర్. అందరూ బయటికి వెళ్తుండగా సులోచన వేద చేయి పట్టుకుని ఆపుతుంది. క.. క.. అంటూ నసుగుతుంది. ఏమైందని వేద అడగ్గా.. చెప్పలేకపోతుంది సులోచన. అది దూరం నుంచి గమనిస్తాడు యశోదర్.
ఏడుస్తున్న వేదని ఓదారుస్తాడు యశ్. తల్లి మంచితనాన్ని గుర్తుచేసుకుంటూ కంటతడి పెడుతుంది వేద. మా అమ్మకి ఇలా జరగాల్సి కాదండీ అంటూ భర్తతో చెప్పుకుంటుంది. మా అమ్మ రోడ్డు మీద నడుస్తున్నపుడు ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇది ఆక్సిడెంట్‌లా అనిపించట్లేదు.. ఎవరో కావాలని చేశారని నా సిక్స్ సెన్స్ చెబుతుంది అని అనుమానం వ్యక్తం చేస్తుంది. ఆ అవసరం ఎవరికి ఉందని అడగ్గా.. మనకు కావాల్సిన వాళ్లే ఎవరో అయుంటారని అంటుంది. క.. క.. అని ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుంది.. క.. తో వచ్చే పేరు మన సర్కిల్‌లో ఎవరున్నారని ఆలోచిస్తారు. క అంటే కైలాష్.. సందేహం లేదు మా అమ్మకు ఆక్సిడెంట్ చేసింది కైలాషే అనుకుంటూ వెళ్తుంది వేద.
ఆ తర్వాత సీన్‌లో కాంచన కైలాష్‌తో మాట్లాడింది గుర్తుచేసుకుంటుంది. వేద వచ్చి వదినా.. మొన్న కైలాష్ నీతో ఏం మాట్లాడాడు. ఫోన్ ఇక్కడ ఇవ్వు. నిజం చెప్పమని దబాయిస్తుంది వేద. దాంతో నసుగుతుంది కాంచన. నీ ఫోన్‌లో ఆటోమేటిక్ కాల్ రికార్డ్ ఉంది ఇక్కడివ్వు ఇపుడే తేల్చేస్తా అంటుంది. దాంతో కాంచన కైలాష్ మాట్లాడిందంతా చెప్పేస్తుంది. ఆ తరువాతి ఎపిసోడ్‌లో వేద, యశ్‌లు అభిమన్యు ఇంటికి వెళ్లి కైలాష్ కోసం ఆరా తీస్తారు.