Surya:సినీ ఇండస్ట్రీలో హీరో సూర్య అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. సూర్య పూర్తి పేరు శ్రావణ్ శివకుమార్. సినిమా ఇండస్ట్రీలో సూర్య అనే పేరుతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. సూర్య 1975 జులై 23న జన్మించాడు. సూర్య సూర్యనంద సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. 2001 లో ఈ సినిమాలో అద్భుత పాత్రను పోషించి ప్రేక్షకులను మెప్పించాడు.
ఈ మధ్య ఎక్కడ చూసినా యువకులలో రోలెక్స్ సర్, అనేది ఒక ట్రెండ్ గా మారిపోయింది ఇంస్టాగ్రామ్ లో ఎక్కువ గా ఇష్ట పడే, రోలెక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో రీల్స్ లో ఎక్కువగా వీడియోస్ చేస్తున్నారు.విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్ర మాత్రమే అందరూ గుర్తుపెట్టుకున్నారు. అంతలా అందరిని ఈ రోలెక్స్ పాత్ర ఆకట్టుకుంది.
సూర్య కళ్ళల్లో ఓ రకమైన క్రూరత్వం ఇంకా నవ్వుతూనే అందరిని భయపెట్టడం వంటివి సూర్య నిమిషాలలో సినిమాకు కావాల్సిన మాస్ యాక్షన్ ను చేశాడు. ఈ సినిమా కమల్ కి గ్రాండ్ హిట్ ఇచ్చింది. సూర్య రోలెక్స్ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు.విక్రమ్ సినిమాను దర్శకత్వం వహించిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ‘విక్రమ్’సినిమా లో సూర్యను రోలెక్స్ పాత్రలో మొదటిగా ఎంపిక చేశారు.
కానీ సూర్య రోల్ నీ చేయడానికి కాస్త భయపడ్డాడు. కమల్ హాసన్ చెప్పిన మాటలను ఒక సారి గా విని సూర్య ఒప్పుకున్నానని, స్వయంగా ఈ విషయాన్ని హీరో సూర్య సైమా అవార్డ్స్ ఫంక్షన్ లో వెల్లడించాడు . ఈరోజు నేను ఏం చేసినా ఈ స్థాయిలో ఉండటానికి కారణం కమల్ హాసన్ గారు నాకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన ఫోన్ చేసి అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోవాలని అనుకోలేదు. భయపెట్టిన విషయం లేదా పని చేస్తే ఎదుగుదల అని నమ్ముతాను. కాబట్టి రోలెక్స్ పాత్రను చేయనని లోకేష్ కి చెప్పాను.
Surya: విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్ర గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సూర్య..
కానీ అంతలోనే మనసును మార్చుకొని ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాను. కేవలం ఈ సినిమాను ఒప్పుకోవడానికి ఒకే ఒక వ్యక్తి కారణం, ఆ ఆ వ్యక్తి ఎవరో కాదు కమల్ హాసన్ అని సూర్య వెల్లడించాడు. ఇది ఇలా ఉండగా విక్రం సినిమాలో కమల్ హాసన్, సూర్య, విజయ్ సేతుపతి, ఫహద్ ఫజీల్ వీరందరూ ముఖ్య పాత్రలలో నటించి మెప్పించారు. ఈ సినిమా రూ. 300 కోట్లు పైగా కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.