Mrunal Thakur:ప్రముఖ నటి మృణల్ ఠాకూర్ అంటే ఇప్పుడు తెలియని వారుండరు. సీతా రామం సినిమాతో దేశ్వ్యాప్తంగ అభిమానులను సంపాదించుకుంది. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అందులో సీతామహాలక్ష్మి గా అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఆమె తన కెరీర్ ను టెలివిజన్ నుండి తన నటనా వృత్తిని ప్రారంభించింది.
ముజ్సే కుచ్ కెహ్తీ,యే ఖామోషియాన్, కుంకుమ్ భాగ్య లో సమాంతర ప్రధాన పాత్రలో కనిపించింది.ఠాకూర్ లవ్ సోనియా సినిమా తో బాలీవుడ్ లో ప్రవేశం చేసింది. 2019లో సూపర్ 30, బాట్లా హౌస్‌లో కనిపించింది. మృణాల్ అప్పటి నుండి టూఫాన్, ధమాకా, జెర్సీ చిత్రాలలో నటించి బాలీవుడ్ లో మంచి గుర్తింపును తెచ్చుకుంది.
కానీ ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.సీతా రామం సినిమా తో ఈమెకు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. కుర్రోళ్ళు మాత్రం ఈమెను తమ క్రష్ లిస్ట్ లోకి చేర్చుకున్నారు. అయితే ఇక అభిమానులందరీ దృష్టి ఆమె తదుపరి సినిమా మీదే ఉంది. ఆమె నెక్స్ట్ ఏ సినిమా చెయ్యబోతుంది అన్న దానిమీద అభిమానులు అందరూ ఫోకస్ చేశారు.
అయితే ఇటీవల ఆమె తదుపరి సినిమాకు సంబంధించి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల నానితో మృణాల్ ఠాకుర్ దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అయితే నాని మృణాల్ కలిసి సినిమా తీయబోతున్నారా? లేదా ఈ సినిమా సక్సెస్ ను పంచుకోడానికి వాళ్ళిద్దరూ కలిశారా? అన్నదానిమీద క్లారిటీ లేదు.
Mrunal Thakur:త్వరలోనే మరో సినిమా తో రాబోతున్న మృణాల్..
సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి తో ఇంతకుముందే నాని కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమా చేశాడు. దీంతో నానితో మరో సినిమా హను చేయబోతున్నాడేమో.. దానికి కథానాయకగా మృణాల్ నీ ఎన్నుకున్నారేమో.. అని అభిమానులు అంతా అనుకుంటున్నారు. ఇక ఇప్పటికే సీతారామం టీం తో మరో సినిమా ఉందని డైరెక్టర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అభిమానులు మృణాల్ తదుపరి సినిమా అప్డేట్స్ కోసం వేచి చూడాల్సిందే.