నిన్నటి ఎపిసోడ్‌లో సత్య ‘నా భర్త వెంట ఎందుకు పడుతున్నావ్’ అని రుక్మిణిని చెడామడా వాయిస్తుంది. సత్య, రుక్కు మాటల్ని దూరం నుంచి వింటుంది దేవి. తన తల్లి పేరు రాధ కాదు.. రుక్మిణి అని తెలిసిపోతుంది తనకి. సత్య మాటలకు రాధ కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఆ తర్వాత అక్టోబర్ 11 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
వారసులు కావాలని భర్తతో చెప్పుకుంటూ బాధపడుతుంది దేవుడమ్మ. పిలల్లతో నడిచే నడక మనకు ఆరోగ్యాన్నిస్తుంది. వాళ్లతో గడిపే ఆనందమే మనకు ఆయుష్షునిస్తుందంటూ చింతిస్తుంది. అలా జరగాలంటే ముందు మనక కొడకు, కోడలు అన్యోన్యంగా ఉండాలి. ఆ కోరిక నెరవేరాలనే అమ్మవారి ముందు పొర్లదండాలు పెట్టానని చెబుతుంది దేవుడమ్మ. ఆ మాటల్ని విన్న సత్య ఆనందంతో అత్తని కౌగిలించుకుంటుంది. మీ కోరిక నెరవేరాలనే నేను కూడా మొక్కుకున్నాని అంటుంది. తర్వాత సీన్‌లో రాధ.. దేవి మాటల్ని తలుచుకుని మదనపడుతుంది. ఏమున్నా నాతో చెప్పుకునే దేవమ్మకు ఏమైందని ఆందోళన పడుతుంది. నా చెల్లి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది.. ఈ విషయం పెనిమిటికి చెప్తే వాళ్లిద్దరికి లొల్లి అయితదని పలు పలు విధాల ఆలోచిస్తుంది రాధ. అక్కడ ఆదిత్య.. సత్య కోసం రుక్మిణి చేసిన త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ బాధపడుతుంది. నన్ను పెనిమిటి అని పిలిచినందుకే ఇంతలా బాధపడితే ఎలా.. ఒకవేళ రుక్మిణికి నిజం తెలిస్తే చెల్లి కోసం మళ్లీ కనబడకుండా పోతుంది అనుకుంటాడు ఆదిత్య మనసులో.
దేవమ్మని పిలిచి పడుకోమంటుంది రాధ. నేను అవ్వ దగ్గర పడుకుంటానని వెళ్తుంది దేవి. దేవికి ఏమైందో తెలుసుకుందామని చిన్మయి ఆదిత్యకు ఫోన్ చేస్తుంది. ‘ఆఫీసర్ అంకుల్. దేవి దేని గురించో బాధపడుతుంది. ఎంతడిగినా చెప్పట్లేదు. రేపు స్కూల్ దగ్గరికి రండి అంకుల్’ అని చెప్తుంది. ఆదిత్య సరేనని ఫోన్ కట్ చేస్తాడు. మాధవ్ మళ్లీ ఏం చెప్పాడోనని కంగారుపడతాడు ఆదిత్య.
మరుసటి రోజు ఉదయం జానకి దగ్గరికి వస్తాడు మాధవ్. ‘ఏంటమ్మా.. నిన్నిలా ఒంటరిగా వదిలేశారు. అసలు నువ్ ఏం అమ్మవి. బిడ్డ కోసం తల్లి ప్రాణాలిస్తుంటారు. ఆ రోజు నువ్ అడ్డుపడకుండా ఉంటే ఈ రోజు రాధ నాకు భార్య అయ్యేది. చిన్మయికి తల్లి అయ్యేది. రాధ వెళ్లిపోతే నా బిడ్డ ఏం కావాలి? తల్లి లేని బిడ్డలా పెంచాలా చిన్మయిని’ అంటూ నిలదీస్తాడు. కొడుకు మాటలకు జానకి కోపంతో ఊగిపోతుంది. రాధతో నాకు పెళ్లి చేయాలని ఆలోచించింది మీరే కదా.. మరి ఈ రోజు ఎందుకు అడ్డుపడుతున్నావమ్మా.. నా ప్లాన్ మొత్తం చెడగొట్టింది నువే. దేవిని ఎవరికి ఇవ్వను. దేవిని ఇవ్వడం అంటే రాధను ఇచ్చినట్టే. చిన్మయి, దేవి, రాధ నాకు కావాలి. దానికోసం ఎంతకైనా తెగిస్తానని శపథం చేస్తాడు మాధవ్.
సీన్ కట్ చేస్తే.. ఆదిత్యని టిఫిన్ చేయమంటుంది సత్య. వద్దనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. నీతో మాట్లాడాలంటేనే నచ్చట్లేదంటూ కోప్పడుతాడు ఆదిత్య. ఇంటికి కూడా రావాలనింపించట్లేదని చెప్పి వెళ్లిపోతాడు అక్కడినుంచి. ఆదిత్య, సత్యల తగాదాన్ని దేవుడమ్మ, తన భర్త చాటుగా వింటారు. ఇద్దరూ మాటామాటా పెంచుకొని దూరమవుతున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు ఎందుకు వచ్చాయి. అయినా వీళ్ల మధ్య గొడవకు మూడో మనిషి కారణమా? అంటూ అనుమానం వ్యక్తం చేస్తుంది దేవుడమ్మ. రుక్మిణి దూరమైన తర్వాత కూడా సత్య ఆదిత్యని ఏనాడు మాటనలేదు. కానీ ఇప్పుడు అలా లేదు.. అంటే బయట ఏదో జరిగింది. మన దగ్గర దాచిపెడుతున్నారు. మనతో చెప్పకూడని విషయం ఏమై ఉంటుంది.. అనుకుంటారు దేవుడమ్మ, తన భర్త.
తర్వాత సీన్‌లో రాధని దురుద్దేశంతో చూస్తాడు మాధవ్. అది దూరం నుంచి గమనిస్తుంది భాగ్యమ్మ. రాధని జానకి దగ్గరికి వెళ్లమని పంపిస్తుంది. మాధవ్ దగ్గరికి కాఫీ తీసుకుని వెళ్లి కాలు మీద పడేస్తుంది భాగ్యమ్మ. దాంతో మాధవ్.. రాధమ్మని కోప్పడతాడు. ‘ఏమి రా నకరాలు చేస్తున్నావా. నా కళ్లు కాదు. నీ కళ్లు నెత్తికెక్కాయి. అందుకే ఇలాంటి గలీజు పనులు చేస్తున్నావ్’ అంటూ హెచ్చరిస్తుంది. నా బిడ్డని కష్టపెడితే ఊరుకుంటాననుకుంటున్నావా? అంటూ వార్నింగ్ ఇస్తుంది మాధవకు. ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో ముగుస్తుంది. మరి మాధవ్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..