ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో తెరకెక్కి ప్రేక్షకులకి ముందుకి రావడానికి రెడీ అవుతున్న సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో సుమారు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఒక్క టీజర్ తోనే దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఓ వైపు సినిమా విజువల్ గ్రాండియర్ ని ఫ్యాన్స్, కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఆదిపురుష్ టీజర్ అన్ని భాషలలో రికార్డ్ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకొని దూసుకుపోతుంది. ఒక్క హిందీలోనే ఈ టీజర్ 100 మిలియన్ వ్యూస్ కి చేరువ అయ్యింది. అయితే ఈ సినిమాలో రామాయణంలో పాత్రలని పూర్తిగా వక్రీకరించి దర్శకుడు ప్రెజెంట్ చేసాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హిందుత్వ సంస్థలు అయితే సినిమాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
రాముడు, హనుమాన్, రావణ పాత్రలని రామాయణం కథలో చూపించినట్లు గా తెరపై ప్రెజెంట్ చేయలేదని విమర్శిస్తున్నారు. రావణుడిని ఐఎస్ఐఎస్ టెర్రరిస్ట్ తరహాలో చూపించారని, అలాగే హనుమంతుడి క్యారెక్టర్ ని కూడా మీసం లేకుండా గడ్డంతో ముస్లిం తరహాలో చూపించారని విమర్శిస్తున్నారు. క్యారెక్టర్ లుక్స్ మార్చాలని, లేదంటే ఆదిపురుష్ సినిమాని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై దర్శకుడు ఓం రౌత్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఆదిపురుష్ సినిమా ప్రేక్షకులని ఎ విధంగా కూడా నిరాశపరచదని, అలాగే రామాయణాన్ని అనుసరించే వారిని కూడా ఎ మాత్రం నిరుత్సాహానికి గురి చెయ్యదని చెప్పారు.
కేవలం ఒక నిమిషం టీజర్ తో ఒక నిర్ణయానికి రావొద్దని చెప్పారు. అలాగే పాత్రల చిత్రణ కూడా రామాయణాన్ని అనుసరించే ఉంటాయని, ఎక్కడా కూడా పొరపాటు ఉండదని, ఇంకా ప్రేక్షకుల నుంచి వచ్చే అభ్యంతరాలని పరిగణంలోకి తీసుకొని మరింతగా మా నుంచి బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. దీనిపై విజువల్స్ పరంగా ఉన్న అభ్యంతరాలని దృష్టిలో పెట్టుకొని రీవర్క్ కూడా చేస్తున్నామని చెప్పారు. అయితే హిందుత్వ సంస్థలు మాత్రం ఆదిపురుష్ ని ఇప్పట్లో వదిలేలా అయితే లేరని తాజా పరిణామాలు చూస్తూ ఉంటే అనిపిస్తుంది.