BIGG BOSS: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో గీతూ రాయల్ క్షమాపణ చెప్పడం ఇది రెండో సారి. అంతకు ముందు ఓ సందర్భం జరిగి ఉంటుది. అందేంటంటే.. కీర్తీ కేవలం కేమెరాల కోసమే పని చేస్తోందని బాలాదిత్య, చంటి మాట్లాడుకుంటున్నట్లు గీతూ కీర్తికి చెప్పి ఉంటుంది. దీంతో కీర్తి… బాలాదిత్య, చంటి మీద నెగిటీవ్ ఫీలింగ్ తో ఉంటుంది. కానీ వారు అలా అనడానికి ఉద్దేశ్యం వేరే ఉందని, వారిద్దరూ కేవలం పాజిటీవ్ వేలోనే అలా అన్నారని తర్వాత గీతూకి తెలుస్తుంది. దీంతో ఈ విషయం పెద్ద చర్చకే దారి తీస్తుంది.
ఇలా అప్పటికే చాలా గొడవలు ఉన్న చంటి, గీతూకి ఈ అంశం కారణంగా మరింత దూరం పెరిగి ఉంటుంది. లాస్ట్ వీక్ లో చంటి, గీతూ ఇద్దరిలో ఎవరో ఒకరు నామినేట్ అవ్వాల్సి వస్తుంది. దీంతో అప్పటి వరకు జరిగిన గొడవలకు, నేను కాస్త ఎక్కువగా మాట్లాడినందుకు క్షమించమని మొదటిసారి గీతూ బిగ్ బాస్ హౌస్ లో చంటిని కోరుతుంది. దీంతో చంటి గీతూని క్షమించేసి వివిధ కారణాలతో తానకు తానే నామినేట్ అవడం బిగ్ బాస్ నుండి బయటికి వెళ్లిపోవడం జరిగింది.

ఇక హౌస్ లో ఓ సందర్భంలో సూర్య, ఆరోహి ఎలా క్లోజ్ గా ఉంటారు అనేది గీతూ చేసి చూపించి ఉంటుంది. ఆరోహి స్థానంలో ఫైమాను ఊహించుకుని సూర్య ఎలా బిహేవ్ చేస్తాడు అనేది కాస్త ఎక్కువగా క్రియేట్ చేసి గీతూ చూపించి ఉంటుంది. దీంతో గీతూ ఆలా చేయడాన్ని కారణంగా చెప్పి ఈ సోమవారం హౌస్ లో నుండి బయటకు వెళ్లేందుకు గీతూని నామినేట్ చేస్తాడు. అలా చేడయం వలన ఆరోహి క్యారెక్టర్ గురించి తప్పుగా అనుకునే అవకాశం ఉందని, ఆరోహి ఇది చూసి బాధపడి ఉంటుందేమో అని శ్రీహాన్ వివరిస్తారు.
దీంతో నేను కేవలం నవ్వించడానికి మాత్రమే అలా చేసి చూపించానని గీతూ చెప్తుంది. నిజంగా ఆ విషయంలో ఎక్కువ చేసినట్లు అనిపిస్తే క్షమించమని శ్రీహాన్ తో పాటు సూర్యకి కూడా గీతూ చెప్తుంది. శ్రీహాన్ నామినేషన్ కోసం చెప్పిన ఈ కారణాన్ని గీతూ యాక్సెప్ట్ చేస్తుంది. సో బిగ్ బాస్ హౌస్ లో ఎక్కడా తగ్గకుండా చిత్తూరు చిరుతగా పేరు పొందిన గీతూ మొత్తానికి రెండోసారి కూడా సారీ చెప్పేసింది.