Chalaki Chanti:జబర్దస్త్ షో ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు చలాకి చంటి అంటే గుర్తుపట్టని వారు ఉండరు. మొదటిగా సినిమాల లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వెండితెర లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే భీమిలి, ప్రేమ కావాలి లాంటి సినిమాల్లో నటించాడు.అయితే తాజాగా చలాకి చంటి బిగ్ బాస్ సీజన్ 6 లో ఎంపికై బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ కూడా అయిపోయాడు. బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించిన చంటి టాప్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉంటాడు అని కూడా అందరూ అనుకున్నారు.
అయితే 21 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ షో ఇప్పుడు రసవతంగా మారింది. ఎందుకంటే ఐదు వారాలలో ఐదుగురు ఎలిమినేట్ అయిపోయారు. అలా టాప్ 5 లో ఉంటాడనుకున్నా చలాకి చంటి ఎలిమినేట్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.అయితే ఎలిమినేట్ అయినవారిని బిగ్ బాస్ కేఫ్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తారన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే చలాకీ చంటిని యాంకర్ శివ ఇంటర్వ్యూ చేసినప్పుడు బిగ్ బాస్ షో పై చలాకీ చంటి షాకింగ్ కామెంట్స్ చేశాడు.
బిగ్ బాస్ చరిత్ర తాకాలంటే ఈ చంటిసారుడి కత్తిలాంటి పంచులు దాటాలి అని చంటి బిగ్ బాస్ ప్రారంభం రోజు వచ్చిన ప్రోమోలో చెప్పిన డైలాగ్ ను యాంకర్ శివ చెబుతూ, ఆ తరువాత పంచులేశారా బిగ్ బాస్ హౌజ్ లో అని వెటకారంగా ప్రశ్నించాడు. అందుకు వేశా అని చంటి జవాబు చెప్పగా ఎక్కడ అని యాంకర్ శివ మళ్లీ అడిగాడు.
యాంకర్ శివ మీ తప్పు ఏమీ లేదా అని చంటిని ప్రశ్నిస్తూ లేక బిగ్ బాస్ తప్ప అని చెబుతుండగా చంటి కలుగజేసుకుని నువ్వు ఎలాగైనా అనుకో ప్రాబ్లం లేదు అని చెప్పాడు. నాకు ఇప్పటివరకు అర్థమైన దాని ప్రకారం హౌస్ లో ఒక ఫేక్ ఆట నడుస్తుందని నాకు అనిపించింది.
Chalaki Chanti: బిగ్ బాస్ లో ఆడుతున్న గేమ్ ఒక ఫేక్..
గీతూ గురించి మాట్లాడుతూ నేను ఇట్లనే ఉంటా, ఇట్లనే ఆడతా,ఎవర్నైనా మోసం చేస్తా,ప్రపంచంలో ఏ మనిషికి ఆ బుద్ధి ఉండదు అని చెప్పాడు. ఆడియెన్స్ తీసుకున్న డెసిషియన్ రైట్ ఆర్ రాంగ్ అనేది ఎవరికి వారు ఓటు వేసిన వాళ్లకే తెలియాలి అని చంటి చెప్పడంతో సో ఆడియెన్స్ మీద కోపమా, అని యాంకర్ శివ ప్రశ్నించాడు. దీనికి నువ్ అటుగా మారుస్తున్నావ్ రరేయ్,ఎన్ని చూశాం,అంటూ యాంకర్ శివ చంటికి చెప్పాడు. ఇంకా ఈ వీడియోలో జరిగిన పూర్తి సమావేశం తెలుసుకోవాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.