Ram Charan: ప్రముఖ యంగ్ హీరో రామ్ చరణ్ అంటే పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. రామ్ చరణ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2007లో విడుదలైన చిరుత సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు.ఈ సినిమాలో తన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుని, వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు.
రాజమౌళి దర్శకత్వం లో మగధీర సినిమా చేసి, ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా సెన్సేషన్ సృష్టించింది. ఆ తర్వాత కొన్ని సినిమా లు పరాజయం అయిన కూడా సినిమా ఆఫర్ లు బాగానే వచ్చాయి. అయితే తాజాగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించాడు.రామ్ చరణ్ కెరీర్ లో ఇది మొదట పాన్ ఇండియా సినిమా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైరా సినిమా ను నిర్మిస్తున్నప్పుడు కలెక్షన్ల గురించి అంకెల రూపంలో నేను ఇప్పటినుంచి ప్రకటించమని ఒక సంచలమైన నిర్ణయం తీసుకొని అందరితో శభాష్ అనిపించుకున్నారు.
టాలీవుడ్ లో కొన్ని పెద్ద పెద్ద సినిమాలు ఫేక్ కలెక్షన్ల గురించి చెప్పడం వల్ల కొంతమంది యాంటీ ఫ్యాన్స్ తప్పుడు లెక్కలు చెబుతున్నారని వీరిని విమర్శించేవారు. అలాంటి సమయంలో రామ్ చరణ్ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడని అందరూ ప్రశంసించారు.ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ చిరంజీవి గారిని రామ్ చరణ్ తీసుకున్న ఈ నిర్ణయం గురించి ప్రశ్నించగా, మెగాస్టార్ సమాధానం చెబుతూ చరణ్ ఎంతో పరిణితి చెందిన నిర్ణయం తీసుకున్నాడని చెప్పారు.
కానీ ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాకు అప్పుడు చెప్పిన మాటలన్నీ మర్చిపోయి మళ్లీ కలెక్షన్లకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. దాంతో ఇతర హీరోల ఫ్యాన్స్ అందరూ మళ్లీ ఈ విషయం గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. గాడ్ ఫాదర్ స్ట్రాటజీ ఏమిటంటే రూపాయి మార్కెట్ ఉన్న దగ్గర, అర్ధ రూపాయికి, పావులకి అడ్వాన్స్ లపై సినిమాని ఇచ్చారు. సినిమా ఆ అడ్వాన్సులకు చేరుకోగానే అదిరిపోయింది అని సంబరాలు చేసుకుంటున్నారు అని కూడా కామెంట్లు చేస్తున్నారు.
Ram Charan: రామ్ చరణ్ ఈ విషయంలో మాట తప్పడా..
గాడ్ ఫాదర్ సినిమా ను కొనుగోలు చేసిన నైజాం, ఓవర్ సీస్ ల్లో చూస్తే అసలు లెక్కలు తెలుస్తున్నాయి. ఆంధ్ర సీడెడ్ కూడా అమ్మి వుంటే ఈ పాటికి గోల మొదలయ్యేది. రామ్ చరణ్ స్వయంగా గాడ్ ఫాదర్ నిర్మాణ సంస్థ లో భాగస్వామిగా ఉన్నాడు. రామ్ చరణ్ అలాంటపుడు ఇలాంటి పోస్టర్లు వేయడం తన నిర్ణయానికి వ్యతిరేకం అని నిర్మాతకు చెప్పలేదు.